ETV Bharat / state

దావోస్‌లో మీటింగ్​కు కాలినడకన వెళ్లిన మంత్రి లోకేశ్ - విప్రో, టెమాసెక్ ప్రతినిధులతో భేటీ - MINISTER LOKESH DAVOS TOUR UPDATES

దావోస్‌లో మూడో రోజు పర్యటనలో భాగంగా వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి లోకేశ్

Lokesh meets Wipro and Temasek Representatives for investment in Davos
Lokesh meets Wipro and Temasek Representatives for investment in Davos (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2025, 10:43 PM IST

Lokesh meets Wipro and Temasek Representatives: దావోస్‌లో పెట్టుబడుల కోసం మంత్రి నారా లోకేశ్ తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రాన్ని ఏఐ(AI) హబ్‌గా మార్చాలనుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రంలో డేటా సెంటర్లతోపాటు కార్యకలాపాలు ప్రారంభించాలని విప్రో, టెమాసెక్ సహా వివిధ సంస్థల ప్రతినిధులను కోరారు.

వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం: దావోస్‌లో మూడో రోజు పర్యటనలో భాగంగా వివిధ సంస్థల ప్రతినిధులతో లోకేశ్ సమావేశం అయ్యారు. రాత్రి బసచేసిన హోటల్‌ నుంచి ఏపీ పెవిలియన్‌కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జాం కావడంతో సమాయానికి సమావేశాలకు హాజరయ్యేందుకు కొంతదూరం కాలినడకన వెళ్లారు. టెమాసెక్ హోల్డింగ్స్ భారత స్ట్రాటజిక్‌ ఇనిషియేటివ్ హెడ్ రవి లాంబాతో లోకేశ్ భేటీ అయ్యారు. వైజాగ్, తిరుపతిలో టెమాసెక్‌ టెలీమీడియా ద్వారా డేటా సెంటర్లు, డేటా సెంటర్ పార్కులు ఏర్పాటు చేయాలని కోరిన లోకేశ్ అనుబంధ సంస్థ క్యాపిటా ల్యాండ్ ద్వారా కమర్షియల్ స్పేస్, పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

దావోస్​లో బిజీబిజీగా మంత్రి లోకేశ్ - పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు

టెమాసెక్‌ మరో అనుబంధ సంస్థ సెంబ్ కార్ఫ్‌తో కలసి పవర్ ట్రాన్స్ మిషన్‌ను బలోపేతం చేయడం, గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపర్చడం వంటి కార్యకలాపాలు చేపట్టాలన్నారు. 2028 నాటికి క్యాపిటా ల్యాండ్ ద్వారా భారత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను రెట్టింపు చేయాలనుకుంటున్నామన్న రవిలాంబా ఏపీలో పెట్టుబడులపై సహచర ఎగ్జిక్యూటివ్​లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

బోర్డు సభ్యులతో చర్చించి నిర్ణయం: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ కార్యకలాపాలు ప్రారంభించాలని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీని మంత్రి నారా లోకేశ్ కోరారు. విప్రో అవసరాలు, ప్రాంతీయ విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా విశాఖ, విజయవాడ, తిరుపతిలో కార్యకలాపాలు ప్రారంభించాలని అభ్యర్థించారు. AI, క్వాంటమ్ కంప్యూటింగ్, పునరుత్పాదక శక్తిలో అత్యంత నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్‌ఫోర్స్‌ను అభివృద్ధి చేసేందుకు విప్రో సహకరించాలన్నారు. వైజాగ్, విజయవాడలో గ్లోబల్ డెలివరీ కేంద్రాలు, పరిశోధనా హబ్‌ల ఏర్పాటును పరిశీలించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్, బ్లాక్ చైన్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో విప్రో పెట్టుబడులు పెడుతోందన్న రిషద్ ప్రేమ్‌జీ బోర్డు సభ్యులతో చర్చించి ఏపీలో పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

'ఫ్యూచర్ సీఎం లోకేశ్' అని ప్రస్తావించిన టీజీ భరత్​ - చంద్రబాబు ఆగ్రహం

షేపింగ్ ద ఫ్యూచర్ నెక్ట్స్ జెన్ ఏఐ –ఇన్నొవేషన్ హబ్, డాటా ఫ్యాక్టరీ అండ్ ఏఐ యూనివర్సిటీ అంశంపై దావోస్ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలోనూ లోకేశ్ పాల్గొన్నారు. విద్యార్థుల్లో AI నైపుణ్యాలను పెంపొందించడానికి 7నుంచి 9వ తరగతి వరకూ పాఠశాల పాఠ్యాంశాల్లో ఏఐని ప్రవేశపెట్టనున్నట్లు లోకేశ్ చెప్పారు. భవిష్యత్తులో పింఛనుదారుల గుర్తింపు, పెన్షన్‌ల పంపిణీ కోసం ఏఐ ఆధారిత రియల్ టైమ్ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ అమలు చేస్తామని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఏఐని వినియోగించి ఎప్పటికప్పుడు రైతులకు అవసరమైన టెక్స్ట్ మెసేజ్​లు పంపడం ద్వారా పంట ఉత్ఫాదకత పెంపుదలకు చర్యలు చేపడుతున్నాం. అమరావతిని ఏఐ సిటీ ఆఫ్ ఇండియాగా మార్చాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని, విశాఖలో ఏఐ వర్సిటీని అభివృద్ధి చేసేందుకు ఎన్విడియాతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాట్లు తెలిపారు.

పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో పూర్తి సానుకూల వాతావరణం: నారా లోకేశ్

విశాఖను ఏఐ, టెక్ హబ్​గా మార్చేందుకు వ్యూహాత్మక పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు లోకేశ్ చెప్పారు. బిల్డింగ్‌ ద ఎకో సిస్టమ్ ఫర్ ఇంటెలిజెంట్ ఇండస్ట్రీస్ అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న లోకేశ్ విశాఖలో ఐఓటీ, ఏఐ అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం నాస్కామ్ భాగస్వామ్యంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేసిందన్నారు. 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలో 3 నాలెడ్జి సిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇందులో ఏఐ యూనివర్సిటీ, నేషనల్ సెంటర్ ఫర్ ఏఐ, 5 ప్రపంచస్థాయి మల్టీ డిసిప్లినరీ విద్య, పరిశోధన విశ్వవిద్యాలయాలు ఉంటాయని తెలిపారు. చంద్రబాబు నిర్దేశించిన థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ నినాదంతో ముందుకు సాగుతున్నట్లు లోకేష్‌ చెప్పారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం విద్యారంగ గవర్నర్ల భేటీలో పాల్గొన్నలోకేశ్ ఏపీలో 3 ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు స్థాపించబోతున్నట్లు తెలిపారు. 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో రూ. 255 కోట్లు నిధులు కూడా కేటాయించామని వివరించారు.

'నారా లోకేశ్ డిప్యూటీ సీఎం అంశం' - ఎవరూ మాట్లాడవద్దని అధిష్ఠానం ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.