Doctor Nagendra Interview On Alaknanda Hospital Kidney Racket :హైదరాబాద్ కిడ్నీ రాకెట్ అంశంలో శస్త్రచికిత్స అలకనంద ఆస్పత్రిలోనే జరిగిందా అనేది మరింత విచారించాల్సి ఉందని, ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నాగేంద్ర తెలిపారు. ఆస్పత్రి సీజ్ చేసినందు వల్ల లోతుగా దర్యాప్తు సాధ్యం కాలేదని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులున్న వారే లక్ష్యంగా బ్రోకర్లతో కలిసి దందాకు పాల్పడుతున్నట్లు వివరించారు. పోలీసులతో సమన్వయం చేసుకుంటూ విచారించి, తుది నివేదిక ఇవ్వాల్సి ఉందంటున్న డాక్టర్ నాగేంద్రతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
"కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కిడ్నీ ఇచ్చిన వారు తమిళనాడు చెందిన వారు. మాయమాటలు చెప్పి వారిని హైదరాబాద్కు తీసుకువచ్చారు. కిడ్నీ తీసుకునేవారు రూ.50 లక్షలు ఆసుపత్రి యాజమాన్యానికి ఇచ్చారు. కిడ్నీ డొనేట్ చేసేవారికి డబ్బులు ఇంకా ఇవ్వలేదు."-డాక్టర్ నాగేంద్ర, కమిటీ అధ్యక్షుడు