ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్​ ప్రచార వాహనం వెంట ఎస్పీ, సీపీలు ఉండాలి - డీజీపీ తీరుపై విమర్శలు - CP And SPs to Guard in CM Jagan

DGP Orders CP And SPs to Guard in CM Election Campaign: సీఎం జగన్​ ఎన్నికల ప్రచారం వాహనం వెంట ఆయా జిల్లాల ఎస్పీ, సీపీలు ఉండాలని డీజీపీ రాజేంద్రనాథ్​రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్‌ ఉన్నా సరే జగన్‌ పట్ల ఉన్న స్వామి భక్తిని ప్రదర్శించడంలో ఆయన ఏ మాత్రం తగ్గట్లేదు. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్పీలు, సీపీలను సీఎంకి కాపలాదారులుగా మార్చేయడం ఏంటని విశ్రాంత పోలీసు అధికారుల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

DGP Orders CP And SPs to Guard in CM Election Campaign
DGP Orders CP And SPs to Guard in CM Election Campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 21, 2024, 10:45 AM IST

DGP Orders CP And SPs to Guard in CM Election Campaign: సీఎం జగన్‌ ఏ జిల్లాకు వెళితే అక్కడి ఎస్పీ లేదా పోలీసు కమిషనర్‌ ఆయన ఎన్నికల ప్రచార వాహనం వెన్నంటే ఉండాలట. ప్రచారం కోసం ఎక్కడైనా ఆ బస్సు ఆగితే మరుక్షణమే దాని ప్రవేశ ద్వారం వద్దకు చేరుకుని బందోబస్తులో పాల్గొనాలట. రోప్‌ పార్టీలు ఉండాల్సిన చోట ఉన్నాయా? లేదా అనేది దగ్గరుండి మరీ చూసుకోవాలట. పూర్తిగా వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారనే ఫిర్యాదులు, అభియోగాలు ఎదుర్కొంటున్న డీజీపీ రాజేంద్రనాథరెడ్డి ఎన్నికల కోడ్‌ ఉన్నా సరే జగన్‌ పట్ల తన స్వామి భక్తిని ప్రదర్శించడంలో ఏ మాత్రం తగ్గట్లేదు.

నిన్నటి దాక పరదాల మాటున- తాజాగా నాటి ముద్దుల ప్రచార ప్రదర్శన ! ఓట్ల కోసమే భద్రతను మరిచారా?

ఎన్నికల సంఘం చర్యల కత్తి ఆయనపై వేలాడుతున్నా వైసీపీకి రాజకీయంగా అనుచిత లబ్ధి కలిగే ఆదేశాలిచ్చి అమలు చేయించడంలో ఎక్కడా కూడా వెనుకంజ వేయడంలేదు. అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లకు తాజాగా ఈ ఆదేశాలు ఇచ్చారు. నిష్పక్షపాతంగా పనిచేసే పోలీసు అధికారుల నుంచి ఈ ఆదేశాలపై తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్పీలు, సీపీలను ముఖ్యమంత్రికి కాపలాదారులుగా మార్చేయడం ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇదేమైనా రాచరికమా జగన్‌ ఏమైనా చక్రవర్తా? ఆయనకేమైనా ప్రత్యేకంగా ప్రతిపత్తి కల్పించారా. లేకపోతే ఇలాంటి ఆదేశాలివ్వడం ఏంటి? డీజీపీని ఎన్నికల సంఘం ఆ పోస్టు నుంచి తప్పించడానికి ఈ ఒక్క కారణం చాలు అని విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

Z Plus Security: సీఎం జగన్​కు ఉగ్రముప్పు.. జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: ఏపీ ఇంటెలిజెన్స్

కట్టడి విధుల్లో ఉండాల్సిన వారిని కట్టిపడేస్తారా:సీఎంకు భద్రతగా రోప్‌ పార్టీని నిర్వహించడానికి ఎస్పీ, సీపీ స్థాయి అధికారులను ప్రచార వాహనం ప్రవేశ ద్వారం వద్ద కాపలా పెడతారా? ఇది వాళ్ల ప్రాథమిక విధులైన శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ వంటి వాటి నుంచి దూరం చేయడం కాదా. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతూ హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. వైసీపీ నేతల ఆధ్వర్యంలో మద్యం, నగదు, ఇతర ప్రలోభాల
పంపిణీ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇలాంటి వాటిని సమర్థంగా కట్టడి చేయాల్సిన విధుల్లో బిజీగా గడపాల్సిన ఎస్పీలు, సీపీలను చివరికి సీఎం ఎన్నికల ప్రచార వాహనం చుట్టూ తిరిగేలా చేస్తున్న ఘనత డీజీపీకే దక్కింది. ఎస్పీలు, సీపీలను ముఖ్యమంత్రి రాజకీయ కార్యకలాపాలకు దగ్గరగా చేయటం వారి వృత్తిపరమైన బాధ్యతలు, రాజకీయ నేతలతో సంబంధాల మధ్యనున్న సున్నితమైన విభజన రేఖను చెరిపేసేందుకే ఈ ఆదేశాలు ఇచ్చినట్లు కనిపిస్తోందని ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఈనాడుకు వివరించారు.

సీఎం దాడి ఘటనలో సుస్పష్టంగా భద్రతా వైఫల్యం- లోపభూయిష్ఠంగా సిబ్బంది తీరు - Security Failure in Jagan Incident

సీఎం భద్రత, బందోబస్తు నిర్వహణ కోసమే ప్రత్యేకంగా ఎస్పీ స్థాయి అధికారితోపాటు సీఎం సెక్యూరిటీ గ్రూపు సిబ్బంది ఉన్నారు. వీళ్లు కాకుండా ఎక్కడికక్కడ ఆయా జిల్లాల పోలీసులు బందోబస్తు ఉంటున్నారు. అయినా సరే జిల్లా ఎస్పీలు ఈ బందోబస్తు విధుల్లో పాల్గొనాలని డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. ఇటు పోలీసు అధికారులకు, అటు ముఖ్యమంత్రికీ మధ్య అనవసరమైన అనుబంధం ఏర్పరచాలన్న ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు జారీ చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్​ రాజకీయ ప్రచారంలో పోలీసు ఉన్నతాధికారులు అనుసంధానమై ఉన్నారనే భావన ప్రజల్లో కలిగించే ప్రయత్నం ఇదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. పోలీసు అధికారుల నిష్పాక్షికత, తటస్థతకు భంగం కలిగించే చర్య అని చెబుతున్నారు. నిబంధనల మేరకు వృత్తిపరమైన విధులు నిర్వర్తించడమా? లేక వైసీపీ పట్ల పక్షపాత ధోరణితో డీజీపీ ఇచ్చిన ఆదేశాలను నెరవేర్చడమా అనేది తేల్చుకోలేక పలు జిల్లాల ఎస్పీలు సతమతమవుతున్నారు.

సీఎం ర్యాలీలో భద్రతా వైఫల్యం- ఏకంగా గన్​ను అక్కడ పెట్టుకొని పూలమాలలు వేసిన కార్యకర్త!

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక సీఎం సహా ఏ వీవీఐపీ భద్రతా, బందోబస్తు విధుల్లోనైనా పాల్గొనాలా? లేదా అనేది ఆయా ఎస్పీల విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. భద్రతాపరంగా వాళ్లు అక్కడ ఉండాల్సిన అవసరం ఉందనుకుంటేనే వెళ్లాలి లేకుంటే అవసరం లేదు. కానీ ఇకపై ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు సీఎం బందోబస్తు విధుల్లో ఉండి తీరాల్సిందేనని డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. సాధారణంగా ఈ విధులు నిర్వహించేందుకు డీఎస్పీ స్థాయి అధికారి సరిపోతారు. ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు ఈ బందోబస్తు విధుల్లో పాల్గొనాలని ఆదేశాలు ఇవ్వడమంటే వారిపై ఒక రకంగా ఒత్తిడి తీసుకురావడమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనని విశ్రాంత పోలీసు అధికారులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎంతో మంది సీనియర్లను కాదని మరీ డీజీపీ పదవిని కట్టబెట్టినంత మాత్రాన ఇలాంటి ఆదేశాలు ఇవ్వడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

'అన్నొస్తే అంతే!' - అనకాపల్లి ప్రజలకు తప్పని అవస్థలు - CM Jagan Bus Yatra

ABOUT THE AUTHOR

...view details