ETV Bharat / state

వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల - టోకెన్లు ఉన్న భక్తులకే స్వామి దర్శనం - TIRUMALA VAIKUNTA EKADASHI 2025

ఉత్తర ద్వారం దర్శనాలకు తిరుమలలో ఏర్పాట్లు పూర్తి - సర్వాంగ సుందరంగా ప్రధాన ఆలయం, తిరుమల పరిసర ప్రాంతాలు

Tirumala Vaikunta Ekadashi 2025
Tirumala Vaikunta Ekadashi 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 16 hours ago

Tirumala Vaikunta Ekadashi 2025 : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల ఉత్తర ద్వారం దర్శనాలకు ముస్తాబైంది. ఇందుకోసం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ స్వామివారి దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. పోలీసు, విజిలెన్స్ సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. ఈ నెల 10 నుంచి 19 వరకు ఏడు లక్షల మందికి ఉత్తర ద్వార దర్శనం కల్పించేలా ఇప్పటికే ఆన్​లైన్​లో కొన్ని టిక్కెట్లు విడుదల చేశారు. 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి తిరుమల, తిరుపతిలోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా సర్వ దర్శన టోకెన్ల జారీ ప్రక్రియను టీటీడీ చేపట్టనుంది.

మరోవైపు ప్రధాన ఆలయంతో పాటు తిరుమల పరిసర ప్రాంతాలను టీటీడీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. తిరుమలకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక శోభ కలిగేలా ఆలయ మాఢ వీధుల్లో రంగవల్లులు, బారికేడ్లు, తోరణాలు, దేవత మూర్తుల ప్రతిమలు ఏర్పాటు చేస్తోంది. మైసూరు దసరా ఉత్సవాల్లో సేవలందించే నిపుణులతో ఈ ఏడాది ప్రత్యేకంగా విద్యుత్‌, పుష్పాలంకరణ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉత్తర ద్వారం ద్వారా ఏడు లక్షల మందికి దర్శనం కల్పించేలా టీటీడీ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. తిరుపతిలోని ఎనిమిది, తిరుమలలోని ఒక కేంద్రంలో ఏర్పాటుచేసిన 94 కౌంటర్ల ద్వారా జనవరి 10, 11, 12 తేదీల సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు. మొదటి మూడురోజులకు సంబంధించి లక్షా ఇరవై వేల టోకెన్లను 9వ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి జారీ చేయనున్నారు. మిగిలిన రోజులకు సంబంధించి ఆయా తేదీల్లో తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవీ కాంప్లెక్స్‌లలో ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. బ్రేక్ దర్శనం సిఫార్సులు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలు, ఎన్ఆర్ఐ కోటాల కింద భక్తులను దర్శనానికి అనుమతించమని ప్రకటించారు. శ్రీవారి కాలిమెట్ల మార్గంలో టోకెన్లు జారీ నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

Ekadashi Arrangements in Tirumala : ఈ ఏడాది వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. జనవరి 10న ఉదయం నాలుగున్నర గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు, 8 గంటల నుంచి సామాన్య భక్తులకు ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. 10 రోజులపాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్న ఈవో టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు.

"బ్రేక్ దర్శనం, వృద్ధులు, దివ్యాంగులు, ఎన్నారై కోటా దర్శనాలను నిలిపివేశాం. 10 రోజులపాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేశాం. టోకెన్లు ఉన్న భక్తులనే దర్శనానికి అనుమతిస్తాం. ఉత్తర ద్వారం ద్వారా 7 లక్షల మందికి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశాం." - శ్యామలరావు, టీటీడీ ఈవో

వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో తిరుమలలో ట్రాఫిక్​ అంతరాయం లేకుండా పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వీవీఐపీ ప్రముఖులకు వారికి కేటాయించే టికెట్లపైనే వాహన పార్కింగ్ స్థలం, దర్శన ప్రవేశ మార్గం, పికప్ పాయింట్ల వివరాలను ఇవ్వనున్నారు. మొత్తం 12,000ల వాహనాలు పార్కింగ్ చేసేలా స్థలాన్ని ఏర్పాటు చేశారు. వీఐపీ వాహన రాకపోకల వల్ల సామాన్య భక్తులకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. 3000ల మంది పోలీసులు, 1550 మంది విజిలెన్స్ సిబ్బందితో పర్యవేక్షణ చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు.

వైకుంఠ ప్రాప్తిని కలిగించే ముక్కోటి ఏకాదశి- ఈ నియమాలు పాటిస్తే మోక్షం ఖాయం!

శ్రీవారి భక్తుల కోసం ఆరువరుసల జాతీయ రహదారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.