తెలంగాణ

telangana

ETV Bharat / state

YUVA : లక్ష్యం ముందు చిన్నబోయిన శారీరకలోపం - గురిపెడితే మెడల్ ఖాయం - DHANUSH SRIKANTH IN KHELO INDIA

DHANUSH SRIKANTH STORY: మాట్లాడలేక పోవడం, వినికిడి లోపం అతడి దృష్టిలో వైకల్యాలే కావు. తన లక్ష్యం ఒక్కటే. తుపాకీ ఎక్కుపెట్టాలి. గురి చూసి స్వర్ణం కొట్టాలి. అదే సంకల్పంతోనే షూటింగ్‌లో సంచలనాల మోత మోగిస్తున్నాడు ఆ హైదరాబాదీ. సాధారణ షూటర్లతో పోటీపడుతూనే ఇటీవల ప్రపంచ బధిర షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో రికార్డు స్కోరుతో 3 స్వర్ణాలు కొల్లగొట్టాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణమే ధ్యేయంగా ముందుకెళ్తున్న యువ షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్ సక్సెస్‌ స్టోరీ మీకోసం.

BADHIRA SHOOTING CHAMPIONSHIP
DHANUSH SRIKANTH SHOOTING SPORT (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2024, 3:37 PM IST

Updated : Sep 21, 2024, 4:29 PM IST

DHNUSH SRIKANTH YUVA STORY:ఏ టోర్నీలో పాల్గొన్నా గురి తప్పకుండా స్వర్ణాలు సాధిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు ఈ షూటర్‌. ప్రపంచవేదికలపై నిలకడగా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ రికార్డులు తిరగరాస్తున్నాడు. డెఫ్లింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడిగా ఘనతకెక్కాడు. ఈ మధ్యే జర్మనీలోని హనోవర్‌లో జరిగిన ప్రపంచ బధిర షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో3 పసిడి పతకాలతో మురిశాడు.
హైదరాబాద్ సైనిక్‌పురిలో నివాసం ఉంటున్న ధనుష్‌ శ్రీకాంత్ రంగనాధన్- ఆశా శ్రీకాంత్‌ల కుమారుడు. పుట్టుకతోనే బధిరుడైనా చిన్నప్పటి నుంచి అన్నింటా చురుగ్గా ఉండేవాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు సాధారణ పిల్లలు చదివే స్కూల్లోనే చేర్పించారు. పాఠశాల స్థాయిలో చిత్రలేఖనం, వివిధ క్రీడల్లో రాణించాడు. 8 ఏళ్లప్పుడే తైక్వాండోలో డబుల్‌ బ్లాక్‌బెల్డ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం దూరవిద్యలో బీఏ చేస్తున్నాడు శ్రీకాంత్‌.

చిన్నతనంలో తుపాకీ బొమ్మలతో ఆడుకోవడాన్ని ఎంతో ఇష్టపడేవాడు ధనుష్‌. 2016లో ఇంటికి సమీపంలో షూటర్‌ గగన్ నారంగ్‌ నడుపుతున్న గన్‌ ఫర్‌ గ్లోరీ షూటింగ్ శిక్షణా కేంద్రంలో చేర్చమని తల్లిని అడిగాడు. వ్యయప్రయాసలతో కూడుకున్న ఆటైనా కుమారుడి ఇష్టాన్ని కాదనలేకపోయామని అంటోంది శ్రీకాంత్‌ తల్లి.అకాడమీలో చేరిన కొన్నాళ్లకే షూటింగ్ మెళకువలు ఔపోసన పట్టాడు ధనుష్‌. స్థానిక టోర్నీలు మొదలుకుని ఒక్కో మెట్టూ ఎదిగాడు. 2019లో సాధారణ షూటర్లతో పోటీపడి ఖేలో ఇండియాలో తొలి స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. జాతీయ పోటీల్లో 4 గోల్డ్ సహా ఎనిమిది పతకాలు ఖాతాలో వేసుకున్నాడు. అదే జోరును అంతర్జాతీయ పోటీల్లోనూ కొనసాగిస్తున్నాడు.

Masti Goli Soda in Karimnagar : సాఫ్ట్‌వేర్​ జాబ్​ విడిచి.. గోలీ సోడాతో హిట్​ కొట్టాడు

గగన్ నారంగ్ సూచనతో 2022 డెఫ్లింపిక్స్‌లో బరిలోకి దిగాడు ధనుష్‌. దేశానికి తొలి స్వర్ణం అందించి ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నాడు. 2023 ఐఎస్​ఎస్​ఎఫ్​ జూనియర్ ప్రపంచకప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో వ్యక్తిగత స్వర్ణం, జట్టుతో కలిసి రజతం గెల్చుకున్నాడు. తాజాగా ప్రపంచ బధిరుల షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత, మిక్స్‌డ్‌, టీమ్‌ విభాగాల్లో పసిడి పతకాలు గెలిచి చరిత్ర సృష్టించాడు.

ఇప్పటివరకూ 11 అంతర్జాతీయ పతకాలు అందుకున్నాడు ధనుష్‌. అందులో 10 బంగారు పతకాలే ఉండటం విశేషం. ప్రపంచ బధిరుల షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 3 స్వర్ణాలు గెల్చుకోవటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. రికార్డు స్థాయి ప్రదర్శనలతో పతకాలు నెగ్గిన ప్రతిసారీ అభినందనలు తప్ప ఆర్థికసాయం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది ధనుష్‌ తల్లి. ఇప్పుడైనా ప్రభుత్వం సాయం అందించాలని అభ్యర్థిస్తోంది.

తూటాలనే మాటలుగా చేసుకుని షూటింగ్‌లో సంచలనాలకు చిరునామాగా మారాడు ధనుష్‌. ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని రుజువు చేస్తున్నాడు. 2028 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే తన ఏకైక లక్ష్యమని చెబుతున్నాడు. పుట్టుకతోనే మాట్లాడలేని, వినికిడిం వైకల్యం ఉన్నా తన గురికి తిరుగులేదని హైదరబాద్​కి చెందిన యవ షూటర్ నిరూపిస్తున్నాడు. జర్మనీలో ఇటీవలే జరిగిన ప్రపంచ బధిర షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో సరికొత్త రికార్డులతో రెండు స్వర్ణ పతకాలు కొల్లగొట్టాడు.

నమ్మకాన్ని నిలబెట్టాడు: వినికిడి లోపమున్నా, సాధారణ షూటర్లకు ఏమాత్రం తీసిపోని ధనుశ్‌ శ్రీకాంత్ పతక వేటలో దూసుకెళుతున్నాడు. బధిరుల ఒలింపిక్స్‌, డెఫ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాడు. 2028 లో లాస్‌ ఎంజిల్స్‌ జరగబోయే ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాడు హైదరబాద్​కి చెందిన ఈ యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్.నమ్మకాన్ని ఒమ్ము చేయని ధనుష్ డెప్లింపిక్స్ లో స్వర్ణం సాధించాడు. గోల్డ్ మెడల్ తో తిరిగి వచ్చిన ధనుష్ ప్రధాని మోది ప్రశంసలు సైతం అందుకున్నాడు. ధనుష్ ఇప్పటి వరకూ 11 అంతర్జాతీయ మెడల్స్ ను సాధించడగా అందులో 10 స్వర్ణాలే ఉన్నాయంటే ధనుష్ ప్రతిభ ఏంటో ఆర్ధం చేసుకోవచ్చు.

'ఇంజినీర్లు, డాక్టర్లు చాలా ఉన్నారులే నాన్న - నేను కళారంగం వైపు అడుగేస్తా'

ధనుష్ ఇటీవల జర్మనీ లోని హనోవర్‌లో జరిగిన ప్రపంచ డెఫ్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడు బంగారు పతకాలను సాధించిపెట్టాడు. వ్యక్తిగత పోటీలో స్వర్ణం సాధించిన ధనుష్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ క్వాలిఫికేషన్‌లో 632.7 స్కోరుతో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. తోటి భారతీయులు శౌర్య సైనీ (625), మహ్మద్ వానియా (622.7) ఫైనల్స్‌లో వరుసగా రెండు మరియు మూడు స్థానాల్లో నిలిచారు. 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మహిత్ సంధు మరియు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో సైనీ మరియు వానియాతో కలిసి స్వర్ణాలు సాధించాడు. ఇలా షూటింగ్ లో ధూసుకుపోతున్న ధనుష్‌ 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.

షూటింగ్ పై మక్కువ ఉన్న ధనుష్ ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆటలో కొనసాగిస్తున్నామని తన తల్లి ఆశా చెబుతున్నారు. నిలకడగా పతకాలు తెస్తున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి సాయం అందలేదని వాపోయారు. మెడల్ నెగ్గిన ప్రతి సారి అధికారుల వద్దకు వస్తున్నామని. గత ప్రభుత్వంలో అధికారులు, మంత్రుల చుట్టూ తిరిగినా అభినందనలు తప్పితే ఆర్థిక సాయం చేయలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అయినా ధనుష్ ప్రతిభను గుర్తించి సాయం చేస్తే తను మరిన్ని పతకాలు తెస్తాడని ధీమా వ్యక్తం చేశారు. వైకల్యం ఉన్నా సాధారణ ఆటగాళ్లకు ధీటుగా షూటింగ్ లో పథకాలు సాధిస్తున్న ధనుష్ కు ప్రభుత్వ ప్రోత్సహం లభిస్తే దేశం గర్వంచే విధంగా పథకాలు సాధించే అవకాశం లేకపోలేదు.

హైదరాబాద్ సైనిక్‌పురిలో నివాసం ఉంటున్న ధనుష్ చిన్ననాటి నుంచి ఎంతో చురుకుగా ఉండే ధనుష్ కు తుపాకి లపై మక్కువ ఉండేది. ఎక్కడికి వెళ్లినా దానినే తల్లిదండ్రుల చేత బొమ్మ తుపాకి కొనిపించుకుని ఆడుకుంటూ ఉండేవాడు. నేలపై, తలుపులపై టార్గెట్ ఫిక్స్ చేసి వాటిని తుపాకితో కొడుతూ ఆడుకునేవాడు.సాధారణ స్కూల్లో నే చదువుకున్న ధనుష్‌ తొలుత తైక్వాండోను ఇష్టపడ్డ ధనుష్ అందులో డాన్1, 2 బెల్టు కూడా సాధించాడు. కానీ తైక్వాండో లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూనే షూటింగ్ వైపు కూడా ధనుష్ దృష్టి పెట్టాడు. అతను ఉన్న స్థితిలో తైక్వాండోకి కొనసాగించేందుకు తల్లి ఒప్పుకోలేదు. చిన్నప్పటి నుంచి ఉన్న షూటింగ్ పై అతని అభిరుచి మేరకు అతడిని షూటింగ్ వై నడిపించారు. 2015లో 14ఏళ్ళ వయసులో తిరుమలగిరిలోని తన ఇంటి సమీపంలో ప్రారంభంమైన గగన్ నారంగ్​కి చెందిన అకాడమీలో తాను చేరతానని తల్లిదండ్రులను కోరాడు. శ్రీకాంత్ ఓ మధ్యతరగతి కుటుంబంలోనే జన్మించాడు.

Graduate Vegetables Farming In Jagityala : ఉద్యోగం వదిలేశాడు.. కూరగాయల సాగులో లక్షలు సంపాదిస్తున్నాడు

శిక్షణ ఎంతో వ్యయప్రయాసలు తో కూడినది అయినా తల్లిదండ్రులు అతని కోరిక మేరకు అకాడమీలో చేర్పించారు. శిక్షణ సమయంలో ఉత్తమ ప్రతిభను కనబర్చాడు. అకాడమిలో వినియోగించే రైఫిల్ ఇతరులు కూడా వినియోగిస్తుండటంతో సెట్టింగ్స్ ఇబ్బందులు తలెత్తడంతో పూర్తి స్థాయిలో తన గురి సాధించలేక పోయాడు. దీంతో తల్లిదండ్రులు అతనికి షూటింగ్ రైఫిల్ ను కొనుగోలు చేసి ఇచ్చారు. దీంతో ధనుష్ శ్రీకాంత్ తాను గురిపై పదును పెట్టాడు. అనతి కాలంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు.

తిరుమలగిరి లోని గన్‌ ఫర్ గ్లోరి అకాడమీ ధనుష్ ప్రతిభకు మరింత సాన పట్టింది. అతనికి శిక్షణ ఇచ్చేందుకు కోచ్‌లు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. అతనికి అర్ధం అయ్యేలా చెప్పేందుకు కొన్ని సైగలు కూడా నేర్చుకున్నారు. తుపాకి పట్టుకోండం మెళకువతో గురి చూసి కాల్చడం కొన్ని బొమ్మల ద్వారా అతనికి శిక్షణ ఇచ్చారు. ఇలా అక్కడ రాటుదేలిన ధనుష్‌ ఈ ఘనత సాధించిన తొలి బధిర క్రీడాకా రుడిగా రికార్డు సృష్టించాడు. అక్కడి నుంచి తాను వెనక్కి తిరిగి చూసుకోలేదు.

అదే జోరును ధనుష్ కు రెగ్యులర్ ఈవెంట్లలోనే పోటీపడాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ డెఫ్లింపిక్స్ షూటింగ్లో అప్ప టిదాకా ఇండియాకు గోల్డ్ మెడల్ లేకపోవడమే అందుకు కారణం.

YUVA : ఆటలతో పాటు చదువులో సత్తా చాటుతున్న నల్గొండ యువతి - పీఈసెట్​లో టాప్ ర్యాంక్ - Sadhya Got First Rank in PECET

కళ్లు లేకున్నా కలలు సాకారం- చదువులో రాణిస్తున్న లక్కీ మిరానీ సక్సెస్‌ స్టోరీ - Lucky Mirani story

Last Updated : Sep 21, 2024, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details