ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పిఠాపురం నుంచే సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్ ప్రారంభిస్తాం: డిప్యూటీ సీఎం పవన్‌ - Deputy CM Pawan Kalyan Review

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 4:03 PM IST

Pawan Kalyan Review on Solid and Liquid Resource Management: ఘన వ్యర్థాలను 12 గంటల్లో సేకరించగలిగితే వాటిని సంపదగా మార్చవచ్చని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చెప్పారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్‌మెంట్‌పై అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను పిఠాపురంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు పవన్ తెలిపారు

pawan_kalyan_review
pawan_kalyan_review (ETV Bharat)

Pawan Kalyan Review on Solid and Liquid Resource Management:చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలకు పూర్వవైభవం తీసుకు రావడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం నిధులు మళ్లించడంతో చితికిపోయిన పంచాయతీలకు ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని తెలిపారు. దీనికోసం సాలిడ్ లిక్విడ్ రీసోర్స్​ మేనేజ్​మెంట్ ఎస్​ఎల్​ఆర్​ఎం పేరిట వేలూరులో విజయవంతమైన విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించింది.

పిఠాపురం నుంచే సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్ ప్రారంభిస్తాం: డిప్యూటీ సీఎం పవన్‌ (ETV Bharat)

ఈ ప్రాజెక్టుపై ఇటీవల కొంతకాలం అధ్యయనం చేసిన పవన్ తొలుత తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించారు. అక్కడ విజయవంతమయ్యాక ఈ విధానాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు విస్తరించి తద్వారా ఆదాయాన్ని పెంచుకునేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.

చెత్తను, వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసి పంచాయతీలు ఆదాయాన్ని పొందేలా చర్యలు తీసుకుంటామని పవన్ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్​తో కలసి అక్కడ ఏర్పాటు చేసిన సాలిడ్, లిక్విడ్ రీసోర్స్ మేనేజ్​మెంట్ ఫొటో ప్రదర్శనను తిలకించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చెత్తను రీసైక్లింగ్ చేస్తోన్న తీరు సహా అక్కడ అవలంబిస్తోన్న విధానాలను పరిశీలించిన ఉప వీటి గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ వల్ల అనేక అనర్ధాలు వస్తున్నాయని ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల ఆవులు చనిపోవడం చూస్తే బాధనిపిస్తోందని అన్నారు.

శాలువాలు బొకేలు వద్దు - కూరగాయలు ఇవ్వండి: పవన్​కల్యాణ్​ - Pawan Kalyan About Gifts

జలం మనకు పూజ్యనీయమైనవని, కాలుష్యం బారిన పడకుండా కాపాడుకోవాల్సిన అవసరం పవన్ ఉందన్నారు. పంటకాలువలు డంపింగ్ యార్డుల్లా తయారయ్యాయని వాటిని చూస్తే బాధనిపిస్తోందని అన్నారు. ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను రీసైకిల్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని, ఒక్కో పంచాయతీలో చెత్త సేకరించి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తామన్నారు. పనికి రాదని మనం పడేసే చెత్తతో ఏటా 2,643 కోట్లు ఆదాయం తీసుకు రావచ్చని పవన్ తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలో 2.5లక్షల మందికి ఉపాధి సైతం కల్పించేందుకు వీలవుతుందన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్​మెంట్​ను పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

గతప్రభుత్వం పంచాయతీ నిధులన్నింటినీ దారి మళ్లించడం ద్వారా పంచాయతీలను నిర్వీర్యం చేసిందని పవన్ అన్నారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు పంచాయతీల్లో నిధులు లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల మళ్లింపునకు కారణాలు తెలుసుకున్నానని అందరూ ఓ ఉన్నతాధికారి పేరు చెబుతున్నారని తెలిపారు. అందరి వేళ్లు ఆయన వైపే చూపుతున్నాయని ఆయనే బాధ్యులుగా కనిపిస్తున్నారు. ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తే అయన ఇక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. నిధుల మళ్లింపునకు ఎవరిని బాధ్యులుగా చేయాలనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా కనిపిస్తోందన్నారు.

పవన్ కల్యాణ్​ అభిమానికి ఆటో గిఫ్ట్- ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నిర్మాత - SKN Auto Gifted to Pawan Fan Family

వినాయక చవితిని పర్యావరణహితంగా జరుపుకోండి - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పిలుపు - Pawan Kalyan on Vinayaka Chavithi

ABOUT THE AUTHOR

...view details