Deputy CM Pawan Kalyan Reaction On Allu Arjun Arrest :అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి (Attack on MPDO Jawahar Babu) జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించి దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. అనంతరం ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధ్యులను వదిలిపెట్టమని హెచ్చిరికలు జారీ చేశారు. ఈ తరుణంలో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై మీడియా ప్రతినిధులు అడగగా ఆయన స్పందించారు. సమస్యలు చాలా ఉన్నాయని, సినిమా అనేది చిన్న సమస్యని అన్నారు. బాధితుడి పరామర్శకు వచ్చినప్పుడు ఇలాంటివి మాట్లాడడం సరికాదని హితువు పలికారు.
భద్రత బాధ్యత పోలీసులదే : పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారంపై కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. నకిలీ ఐపీఎస్ ఎలా వచ్చాడనేది ఉన్నతాధికారులు చూసుకోవాలని, ఆ బాధ్యత ఇంటెలిజెన్స్, డీజీపీ, హోంమంత్రిదేనని అన్నారు. తనకు పని చేయడం ఒక్కటే తెలుసని, తన భద్రత బాధ్యతలు చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు పెద్దలదేనని తెలిపారు. ఈ అంశంపై తన పేషీ అధికారులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారని, ఈ విషయంపై తాను కూడా డీజీపీతో మాట్లాడతానని వివరించారు.
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ - విచారణ వాయిదా వేసిన కోర్టు