DY CM Bhatti on NEW Ration Cards Issue :కొత్త రేషన్‌కార్డుల జారీకి ఇప్పటివరకు అర్హులైన వారి జాబితా ప్రకటించలేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు స్పష్టం చేశారు. ఇంకా దరఖాస్తులు స్వీకరిస్తున్నందున ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే అర్హులను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభల నిర్వహణపై భట్టివిక్రమార్క, మంత్రులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో మొదటిరోజు 4098 గ్రామసభలు నిర్వహించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
నిరంతర ప్రక్రియ :అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రులు మరోసారి హామీ ఇచ్చారు. గతంలో దరఖాస్తు చేసుకొని వారు ఇప్పుడు గ్రామసభల్లో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. దాదాపు పదేళ్ల తర్వాత రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నందున ఈ రెండు పథకాలకు అత్యధికంగా దరఖాస్తులు వస్తున్నట్లు వివరించారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియగా సాగుతుందని తెలిపారు. గతంలో దరఖాస్తు చేయనివారు ఆ గ్రామ సభల్లో ఇవ్వొచ్చని స్పష్టం చేశారు.