తెలంగాణ

telangana

ETV Bharat / state

మరికొన్ని గంటల్లో తీరం దాటనున్న తుపాన్ - ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం - మరికొన్ని గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం

IMD Warning Rain Alert in AP
IMD Warning Rain Alert in AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2024, 8:24 AM IST

Updated : Nov 28, 2024, 2:54 PM IST

IMD Warning Rain Alert in AP : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా సాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 100 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. నాగపట్నానికి 320 కి.మీ., పుదుచ్చేరికి 410 కి.మీ., చెన్నైకి 490 కి.మీ. దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని చెప్పింది. మరికొద్ది గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుపానుగా మారిన తర్వాత ఉత్తర-వాయవ్య దిశగా పయనిస్తుందని వివరించింది.

శనివారం ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. కారైకాల్​-మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో నేడు, రేపు, ఎల్లుండి (శనివారం) దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాయలసీమలో శుక్రవారం, శనివారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన చోట్ల విస్తారంగా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35-45 కి.మీ., గరిష్ఠంగా 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు పంపింది. గంగవరం, విశాఖపట్టణం, మచిలీపట్నం, కాకినాడ, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేశారు.

దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం - మరో 6 గంటల్లో తుపాను!

ముంచుకొస్తున్న మరో తుపాను - ఏపీ పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

Last Updated : Nov 28, 2024, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details