తెలంగాణ

telangana

ETV Bharat / state

దీపావళి ఆఫర్ల పేరుతో మీ ఫోన్లకు ఇలాంటి మెసేజ్​లు వస్తున్నాయా? - తస్మాత్ జాగ్రత్త - DIWALI ONLINE SHOPPING SCAMS

దీపావళి షాపింగ్ ఆఫర్ల పేరుతో రెచ్చిపోతున్న సైబర్​ నేరగాళ్లు - వెబ్​లింక్​లు, ఏపీకే ఫైళ్లతో నయా మోసాలకు ప్రయత్నం - అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న పోలీసులు

Cyber Criminals Frauds During Diwali
Cyber Criminals Frauds During Diwali (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2024, 7:40 AM IST

Cyber Criminals Frauds During Diwali : దీపావళి ముంగిట సైబర్‌ నేరగాళ్లు నకిలీ టపాసులు పేలుస్తున్నారు. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థల పేర్లతో మోసపూరిత వెబ్‌సైట్ల లింకులు పంపించి ఆర్డర్‌ చేయాలంటూ డబ్బు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారం రోజులుగా దీపావళి ధమాకా పేరుతో మోసపూరిత లింకులు పెద్దఎత్తున వెళ్తున్నట్లు సైబర్‌క్రైమ్‌ పోలీసులు తెలిపారు.

దీపావళి ఆఫర్ల పేరుతో :వెబ్‌లింకులు, ఏపీకే ఫైళ్లు, దీపావళికి చాలామంది దుస్తులు, వాహనాలు, వంట, ఇంటి సామగ్రి, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఫర్నీచర్‌ తదితర వస్తువుల్ని కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. దీనికి తగ్గట్టే ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు పోటాపోటీగా స్పెషల్​ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇదే అవకాశంగా సైబర్‌ ముఠాలు రెచ్చిపోతున్నాయి. పండగ ఆఫర్‌ పేరుతో వెబ్‌లింకులు, ఫోన్‌ డేటా మొత్తం గ్రహించే మోసపూరిత ఏపీకే ఫైళ్లను వాట్సాప్‌నకు పంపిస్తున్నారు. వీటిని క్లిక్‌ చేస్తే వెబ్‌సైట్‌లోకి రీ డైరెక్ట్​ చేస్తుంది. పొరపాటున డబ్బు చెల్లించినప్పటికీ వస్తువులు మాత్రం డెలివరీ అవ్వవు.

ఆ లింక్​లు క్లిక్​ చేస్తే జేబు ఖాళీ :సైబర్​ నేరగాళ్లు ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో 50 శాతం రాయితీ పొందాలంటూ ఏపీకే ఫైల్స్‌తో కూడిన లింకులు పంపిస్తున్నారు. వీటిని క్లిక్‌ చేస్తే ఫోన్‌లోని వ్యక్తిగత ఫోటోలు, ఇతర ముఖ్యమైన వివరాలన్నీ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. కార్లు, బైకులు గెలుచుకోవడానికి బంపర్‌ డ్రా, లాటరీల పేరుతో ఈ-కామర్స్‌ సంస్థల పేర్లతో మేసేజ్​లను పంపిస్తున్నారు. నిజమేనని నమ్మితే జేబు ఖాళీ అవుతుంది తస్మాత్ జాగ్రత్త.

మోసపూరిత ప్రకటనలు :సాధారణంగా పండగ ఆఫర్ల కోసం గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేస్తుంటాం. ఇలా వెతికినప్పుడు గూగుల్‌ ఆల్గారిథమ్‌ ఆధారంగా ఆ వస్తువులకు సంబంధించి యాడ్స్​ వస్తుంటాయి. సైబర్‌ కేటుగాళ్లు ప్రజల్ని బోల్తా కొట్టించేందుకు గూగుల్‌లోనూ నకిలీ ప్రకటనలు ఇస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. రూ.50 వేల విలువ చేసే ఫర్నీచర్‌ రూ.10 వేలకు, రూ.5 వేలకు రిఫ్రిజరేటర్‌ వంటి ఆకర్షణీయమైన ప్రకటనలు ఈ కోవలోకే వస్తున్నాయి. పండగ రోజు ఆత్మీయులు, స్నేహితులకు వాట్సాప్, ఇతర వేదికల ద్వారా ఇటీవల శుభాకాంక్షల పేరుతోనూ కొన్ని నకిలీ లింకులు వస్తున్నాయి. పొరపాటున వాటిని క్లిక్‌ చేస్తే ప్రమాదకర యాప్‌లు డౌన్‌లోడ్‌ అవుతున్నట్లుగా పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.

'అన్నీ దొరుకును - ఎవరికీ దొరకము' - నేరాలకు అడ్డాగా 'స్నాప్ చాట్' - Snapchat Crimes
సైబర్​ నేరగాళ్ల వికృత చేష్టలు - టార్గెట్​ రీచ్​ కాకుంటే 15 అంతస్తుల భవనం 7సార్లు ఎక్కాలి - hyderabad man escape Laos cyber den

ABOUT THE AUTHOR

...view details