Cyber Criminals Use CS Santhi Kumari Picture :రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువవుతున్నాయి. సామాన్య ప్రజలకు ఆశ చూపించి నగదును తీసుకోవడం, వారి అకౌంట్లు నుంచి సమాచారాన్ని పొందడం చేస్తున్నారు. మరికొందరికి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలని ఆశ చూపిస్తున్నారు. ఇలానే ఇంకొంత మందికి ప్రైజ్ మనీ పేరుతో నిలువు దోపిడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. కేటుగాళ్లు సామాన్య ప్రజలనే కాదు అధికారులను కూడా వదలడం లేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కూడా బెడద తప్పలేదు. తన ఫొటో డీపీగా పెట్టుకోని మోసాలు చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు సీఎస్ శాంతి కుమారికి ఫిర్యాదు చేశారు.
Cyber Criminals Fake Calls Shanthi kumari Name : నేపాల్ దేశానికి చెందిన +977-984-4013103 నంబర్‌తో కొందరు ఫోన్లు, మెసేజ్‌లు చేసి మోసాలు చేస్తున్నారని పోలీసులు శాంతి కుమారి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అప్రమత్తమైన ఆమె సీఎస్ కార్యాలయం ప్రతినిధి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
'ప్రముఖుల పేర్లతో ఫేక్ అకౌంట్స్ - ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి'