Hair Fall Prevention Tips in Telugu :పెరుగు.. పొట్టకే కాదు.. జుట్టుకీ మంచిదేనని చెబుతున్నారు నిపుణులు. పెరుగులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, లాక్టిక్ యాసిడ్ కురులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలుపుతున్నారు. పెరుగుతో కలిపి వేసుకునే కొన్ని హెయిర్ ప్యాక్స్ వివిధ జుట్టు సమస్యలను పోగొట్టి జుట్టు కుదుళ్లకు బలాన్ని, మెరుపునూ ఇస్తాయి. అటువంటి కొన్ని ప్యాక్స్ మీ కోసమే..
పెరుగు, మినుములతో..
జుట్టు ఒత్తుగా, బలంగా తయారు కావాలంటే ఈ ప్యాక్ ప్రయత్నించండి.
కావాల్సినవి :
✭ మినుములు - అర కప్పు
✭ పెరుగు - అర కప్పు
ప్యాక్ వేసుకునే విధానం ఇలా !
మినుముల్ని రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే మెత్తటి పేస్ట్‌లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని పెరుగులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, జుట్టు మొత్తానికీ పూర్తిగా పట్టించాలి. అరగంట తర్వాత తక్కువ గాఢత గల షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వల్ల హెయిర్ దృఢంగా, మృదువుగా, అందంగా తయారవుతుంది.
✭ ఈ ప్యాక్ వారానికి రెండుసార్లు వేసుకుంటే మెరుగైన రిజల్ట్ ఉంటుంది.
పెరుగు, మెంతులతో..
మీ జుట్టు చివర్లు చిట్లిపోయి ఎక్కువగా జుట్టు రాలిపోతోందా? అయితే ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి..
కావాల్సినవి :
✭ గడ్డ పెరుగు - ఒక కప్పు
✭ మెంతులు - పావు కప్పు
ప్యాక్ వేసుకోవడం ఎలాంటే !
ముందుగా మెంతుల్ని (Fenugreek Seeds) మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారైన పొడిని పెరుగులో వేసి చిక్కగా అయ్యేంత వరకూ కలుపుతూనే ఉండాలి. ఈ పేస్ట్‌ని హెయిర్ మొదళ్ల నుంచి చివర్ల వరకు, మాడుకూ పట్టించి గంట పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత గాఢతలేని షాంపూతో తలస్నానం చేసి కండిషనర్ రాసుకోవాలి. ఈ ప్యాక్‌లో ఉపయోగించిన మెంతుల వల్ల కురులు ఆరోగ్యంగా ఉండడంతో పాటు చివర్లు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. అలాగే హెయిర్ ఎక్కువగా రాలిపోవడాన్ని అరికడుతుంది.
గుర్తుంచుకోండి..
✭ ఈ ప్యాక్‌ను కేవలం పొడిగా ఉన్న జుట్టు పైనే అప్త్లె చేసుకోవాలి.
✭ వారానికోసారి ఈ ప్యాక్ కురులపై ట్రై చేయచ్చు.
✭ వేసుకోవడానికి కనీసం రెండు గంటల ముందే ఈ ప్యాక్ రెడీ చేసి పెట్టుకోవాలి.
చూశారుగా.. పెరుగు జుట్టు సమస్యలకు ఎలా చెక్ పెడుతుందో.. చాలావరకు ఇలాంటి సహజసిద్ధమైన, సులభంగా తయారు చేసుకునే హెయిర్ ప్యాక్స్ ప్రయత్నించి ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడకుండా మీ కురులను కాపాడుకోండి. అయితే అన్నింటిలోనూ ప్రధానాంశామేమిటంటే తలస్నానానికి ఉపయోగించే షాంపూ గాఢత తక్కువగా ఉండేలా జాగ్రత్తపడండి.
జుట్టు ఊడిపోతుందని చింతిస్తున్నారా?- ఐతే ఈ చిట్కాలు మీ కోసమే
కరివేపాకే అని తీసేస్తున్నారా ? అయితే మీరు చాలా మిస్ అవుతున్నట్లే ! - Health Benefits of Curry Leaves