తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షం - అన్నదాతలకు అపార నష్టం - Crop Damage Due To Untimely Rains - CROP DAMAGE DUE TO UNTIMELY RAINS

Crop Damage Due To Rains : ఈదురు గాలులతో కూడిన వానలకు పొలంలో చేతికొచ్చే దశలో ఉన్న వరిపైరు నేలవాలింది. కొనుగోళ్లు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. ఆరుగాలం కష్టం వరద పాలైందని అన్నదాత ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేయాలంటూ పలు ప్రాంతాల్లో రైతులు రోడెక్కి నిరసన తెలిపారు.

Crop Damage Due To Rains
Crop Damage Due To Rains (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 17, 2024, 9:23 PM IST

అకాల వర్షాలతో తడిసి ముద్దైన ధాన్యం - ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతన్నల వేడుకోలు (ETV Bharat)

Farmers Facing Problems Due To Untimely Rains :జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. రెండువేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉందని తేమ పేరుతో నిర్వహకులు కొర్రీలు పెడుతున్నారని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం కనికరించి కొనుగోళ్లు తొందరగా పూర్తి చేయాలని వేడుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌ మండలాల్లో ధాన్యం నీళ్లలో తడిసిపోయింది. టార్పాలిన్లు కప్పినప్పటికీ లాభం లేకుండాపోయింది. తడిసిన ధాన్యాన్ని తరుగు, కోత లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

Farmers Demand For Paddy Procurement :ధాన్యం వెంటనే కొనాలనే డిమాండ్‌తో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో రైతులు రాస్తారోకో నిర్వహించారు. రాకపోకలకు గంటలపాటు అంతరాయం కలిగింది. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్‌ జిల్లా రామాయంపేటలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. నెల రోజులవుతున్నా వడ్లు కొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తంచేశారు. రాస్తారోకోతో గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. పాపన్నపేట మండలం మిన్పూరులోనూ రైతులు ధర్నా చేశారు. వర్షంతో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ కోరారు. మిరుదొడ్డి మండలం లింగుపల్లి ఐకేపీ కేంద్రంలో తడిసిన వడ్లు చూసి ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేస్తే జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్‌లో రైతులు రోడ్డు ఎక్కారు.

అకాల వర్షాలతో అపార పంట నష్టం - ఆదుకోమంటూ రైతన్నల వేడుకోలు - CROP DAMAGE in Telangana

అన్నదాతలను నిండా ముంచిన అకాల వర్షాలు :కామారెడ్డి నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షం అన్నదాతల్ని ఆగమాగం చేసింది. భిక్కనూరు, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, పాల్వంచలోని కల్లాల్లో నీరుచేరి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. కొనుగోళ్లలో జాప్యంతో వడ్లు మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేటలో డీసీఎంఎస్​ ఛైర్మన్‌ ఇంద్రాసేనారెడ్డిని రైతులు అడ్డుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు తెచ్చి 25 రోజులు అవుతున్నా ఇంకా కొనుగోలు చేయడం లేదన్నారు.

"మేము(రైతులు) వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ఇప్పటికే వారం రోజులవుతుంది. సంచులు ఉండి కూడా ఇవ్వడం లేదు. నిన్న వర్షం పడి ధాన్యం మొత్తం తడిచిపోయాయి. ఇప్పుడు మాకు ఏం చేయాలో తెలియడం లేదు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మమల్ని ఆదుకోవాలి. కాంటాలు, హమాలీలను పెంచి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి"- రైతులు

తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్​ :రైతులు అధైర్యపడొద్దని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి భరోసానిచ్చారు. ఎన్నికల కోడ్ వల్ల అధికారులతో సమావేశం పెట్టలేకపోతున్నామన్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చామని, ఈసీకి కూడా లేఖ రాసి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి, చాకెపల్లి, బట్వాన్ పల్లి, పెర్కపల్లిలో అకాల వర్షానికి తడిచిన వరి ధాన్యాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోశ్‌ పరిశీలించారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.

అప్పు చేసి సాగు చేస్తే - పండే దిక్కులేక పశువులకు మేతగా - ఎండిన పంటలను చూసి రైతన్న కన్నీరు - Water Crisis in jangaon

వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల సాయం అందించాలి : బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details