తెలంగాణ

telangana

ETV Bharat / state

సోషల్‌ మీడియా క్రైమ్‌ స్టోరీ : ఆన్​లైన్​లో చూసి - ఆఫ్​లైన్​లో నేరాలు-ఘోరాలు - SOCIAL MEDIA ON MURDERS

సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్​, వెబ్​ సిరీస్​లు చూసి కిటుకులు తెలుసుకుంటున్న నేరస్థులు - చేసేందుకు, బయట పడేందుకు సోషల్​ మీడియాను ఆయుధంగా వాడుకుంటున్న దుండగులు - నిజమేనంటున్న పోలీసులు

Telangana Crime News
Telangana Crime News (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2025, 9:02 AM IST

Telangana Crime News : ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల తగాదాలు, కుటుంబ సమస్యలు, కుటుంబ తగాదాలు ఇలా ఏమైనా ఉండొచ్చు. అంతటితో ఆగిపోతే ఎలాంటి ప్రమాదం లేదు. కానీ క్షణికావేశంలో నేరాలకు పాల్పడుతున్నారు. నేరాలకు పాల్పడడమే కాకుండా పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇంటర్‌ నెట్‌లో ఎలా హత్యలు చేయాలని వెతుకుతున్నారు. దీంతో పోలీసులకు కూడా ఆ హత్యలు ఏంటో అంతుకాక నేరస్థులను విచారించే సమయంలో వారు చెప్పే మాటలు విని విస్తుపోతున్నారు.

ఇప్పుడు ఇంటర్‌నెట్‌ వచ్చింది. కానీ ఆ రోజుల్లో అయితే పోలీసులకు చిక్కకుండా, ఆనవాళ్లు అనేవి లభించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కరడుగట్టిన నేరస్థుల నుంచి సలహాలు స్వీకరించేవారు. ఇప్పుడు ప్రతీది ఆన్‌లైన్‌. దోపిడీలు, హత్యలు, చోరీలు, మోసాలు, మత్తు పదార్థాల రవాణా వంటి అంశాలను చాలా మంది నేరస్థులు సామాజిక మాధ్యమాలు, వెబ్‌ సిరీస్‌లు, యూట్యూబ్‌లలో చూసే ప్రేరణ పొందుతున్నారు. ఈ మాట నిజమేనని హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌ వంటి వాటిని ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపితే మొత్తం అంతర్జాలంలో వెతికిన అంశాలు బయట పడుతున్నాయని తెలిపారు.

కొన్ని అంతర్జాల ఘటనలు :

  • సికింద్రాబాద్‌లో బంగారు వ్యాపారి ఇంట్లో రూ.2 కోట్ల విలువైన నగలు కాజేసిన ఇంటి దొంగలు రాత్రికి రాత్రే పారిపోయారు. అయితే వారు ఏ విధంగా తప్పించుకున్నారనే ఆరా తీయగా, యూట్యూబ్‌లో చూసి తప్పించుకునే మార్గాలను వెతికినట్లు పోలీసులు గుర్తించారు.
  • పాతబస్తీలో ఒక యువకుడిని హతమార్చేందుకు నలుగురు యువకులు ఓ వెబ్‌సిరీస్‌ను ప్రేరణగా తీసుకొని అఘాయిత్యానికి పాల్పడ్డారు.
  • గ్రాఫిక్‌ డిజైనర్‌గా పని చేసే యువకుడు ఆదాయం సరిపోవడం లేదని నకిలీ నోట్లను తయారు చేశారు. ఆ నోట్లు ఎలా తయారు చేయాలో గూగుల్‌లో వెతికాడు. ఆ విధంగా ఆన్‌లైన్‌లో సామగ్రి కొని రూ.10 లక్షల నకిలీ నోట్లను తయారు చేశాడు.
  • మరోవైపు గాంధీనగర్‌ పరిధిలో ఆస్తి తగాదాలతో అన్నపై తమ్ముడు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. తమ్ముడు నేరస్తులతో చేతులు కలిపి అన్న ఇంట్లోనే దొంగల ముఠాతో మారణాయుధాలతో చొరబడి బంగారు ఆభరణాలు దోచుకొని పారిపోయారు. తమ్ముడిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించగా, విషయం మొత్తం బయటపడింది. ఈ అఘాయిత్యాన్ని హిందీ సినిమాలోని సన్నివేశాల ప్రేరణతో నాటకమాడినట్లు నిందితులు దర్యాప్తులో వెల్లడించారు.
  • మీర్‌పేటలో భార్యను భర్త ముక్కలుగా చేసి వేడి నీటిలో ఉడికించి, ఎముకలను పౌడరుగా మార్చి చెరువులో విసిరేసి ఘోరంగా హత్య చేశాడు. పోలీసులు, అత్త, పిల్లలను తప్పుదారి పట్టించాడు. చివరికి పోలీసులు వారి విచారణలో భర్తే హంతకుడని గుర్తించి, విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ హత్యను ఓ వెబ్‌ సిరీస్‌ను చూసి చేసినట్లు తెలిపాడు.

తల్లి శవాన్ని ముక్కలు చేసిన బాత్రూంనే వాడిన పిల్లలు - మీర్​పేట హత్య కేసులో సంచలన విషయాలు

మిస్టరీ మర్డర్‌ కేసు నిందితుడిని పట్టించిన కండోమ్ - ఇలా దొరికిపోయాడు

ABOUT THE AUTHOR

...view details