Cricketer Hanuma Vihari Met Pawan Kalyan and Nara lokesh :ఏపీమంత్రి నారా లోకేశ్ భరోసాతో మళ్లీ ఆంధ్రా క్రికెట్ జట్టు తరఫున ఆడాలని నిర్ణయించుకున్నానని మాజీ కెప్టెన్ హనుమ విహారి స్పష్టం చేశారు. జట్టును ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తానని మంగళవారం తెలిపారు. సచివాలయంలో మంత్రి లోకేశ్‌ను కలిసిన అనంతరం విహారి విలేకర్లతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అవమానాలను లోకేశ్ దృష్టికి తీసుకెళ్లానని, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)తో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారని అన్నారు. మన జట్టును అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాలని చెప్పారని తెలిపారు. గతంలో జట్టును ఆరుసార్లు సెమీస్‌కు తీసుకెళ్లానని గుర్తు చేశారు.
గత ప్రభుత్వం తన ప్రతిభను తొక్కేసిందని, తాము చెప్పిన వారిని జట్టులో చేర్చుకోలేదని నాటి ఏసీఏ పెద్దలు కుట్ర పన్నారని ఆరోపించారు. తాను ఉంటే వాళ్లకు ఇబ్బందని భావించారని, రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అయినప్పటికీ గత పాలకులు తనను ఇబ్బందులు పెట్టారని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అవమానంతో ఆంధ్రా జట్టును వదిలేయడానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) కూడా తీసుకున్నానని గుర్తు చేశారు. తాను ఇబ్బందులు పడినప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ అండగా నిలిచారని తెలిపారు.
IPL మినీ వేలానికి ఆ టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్లు దూరం.. ఎవరెవరంటే?