ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో మూడు క్రికెట్​ అకాడమీలు - ఎక్కడెక్కడంటే ! - CRICKET ACADEMIES IN AP

రాష్ట్రంలో మూడు క్రికెట్​ అకాడమీలు - ఎక్కడెక్కడంటే !

kesineni_shivanath
kesineni_shivanath (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2024, 5:07 PM IST

Updated : Nov 7, 2024, 5:47 PM IST

Kesineni on Development of Cricket in AP :మంగళగిరిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కార్యాలయంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ముగిసింది. ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన జరిగిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంగళగిరి క్రికెట్ స్టేడియం అభివృద్ధి తో పాటు, రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి సంబంధించి 16 అంశాలపై చర్చించిన ఏసీఏ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో 3 క్రికెట్ అకాడమీలు: రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం విజయవాడ, అనంతపురం, వైజాగ్ ల్లో మూడు చోట్ల క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్‌ తెలిపారు. అకాడమీలు ఏర్పాటుచేసి గ్రామీణ ప్రాంతంలోని ప్రతిభ కలిగిన క్రీడాకారులకు శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ వైఖరి కారణంగా మంగళగిరి క్రికెట్ స్టేడియం నిర్లక్ష్యానికి గురై నిర్మాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. 12 సంవత్సరాల క్రితం నిర్మించడం వల్ల ఈ స్టేడియం స్టేచర్ పాడైపోయిందని ఆయన పేర్కొన్నారు.

అవసరమైతే స్టేడియం పునః నిర్మాణానికైనా సిద్ధం:ఈ స్టేడియంను ఆధునికంగా తయారు చేసేందుకు ప్రయత్నిస్తామని కేశినేని శివనాథ్ తెలిపారు. అవసరమైతే స్టేడియం పునః నిర్మాణం చేస్తామని, స్టేడియం నిర్మాణానికి సంబంధించిన రిపోర్ట్ ఈరోజు వచ్చిందని తెలిపారు. మంగళగిరి స్టేడియంకి పార్కింగ్ సదుపాయాలు లేవు. ప్రభుత్వ సహాయంతో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. స్టేడియం ఆవరణలో ఉన్న రోడ్ల రూపురేఖలు పూర్తిగా మారుస్తామని తెలిపారు. మంగళగిరి క్రికెట్ స్టేడియం కు ఇప్పటివరకు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించి రానున్న కొద్దికాలంలోనే అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రంజీ ట్రోఫీ, అండర్ 19 క్రికెట్ ఆడే క్రీడాకారులకు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తో శిక్షణ ఇప్పించడానికి నిర్ణయించామని ఎంపీ కేశినేని శివనాథ్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.

జగన్​ సర్కార్​ నిర్లక్ష్యంతో కాలువలు పాయే, పంటల పోయో - YSRCP neglect maintenance of canals'జల్ జీవన్ మిషన్'​పై పవన్ ఆరా- గత ప్రభుత్వ వ్యయాలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం - Pawan Review on Jal Jeevan Mission

Last Updated : Nov 7, 2024, 5:47 PM IST

ABOUT THE AUTHOR

...view details