BULLET TRAIN FOR ANDRA PRADESH : నవ్యాంధ్రప్రదేశ్ ఆధునిక రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు కచ్చితంగా శంకుస్థాపన జరగాల్సిందేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర రాజధాని నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకి తమ హయాంలోనే శంకుస్థాపన చేసేలా కృషి చేయాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంపై స్పష్టత ఇస్తూ, గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుకు నిధులు రాబట్టడంపైనా చంద్రబాబు సూచించారు. ఇక పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాలకు పూర్తి హాజరు నమోదు చేయడంతో పాటు నియోజకవర్గంపైనా ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
తిరుమలలో గోవిందా, గోవిందా అని ఎందుకంటారో తెలుసా? - అసలు విషయం ఇదీ!
రాష్ట్ర ప్రయోజనాలే అంతిమ లక్ష్యం అని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం నిధులు రాబట్టడం ప్రధానంగా దృష్టి సారించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలతో తన నివాసంలో కీలక భేటీ నిర్వహించి వ్యూహంపై చర్చించి దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానుండగా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్రంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ఏవిధంగా కేటాయింపులు ఉంటాయి? ఎలా స్పందించాలి అనే అంశంపై చర్చించారు. పార్లమెంటులో బడ్జెట్‌పై జరిగే చర్చలో ఎలా వ్యవహరించాలి? ఏ అంశాలను ప్రస్తావించాలి అనే విషయమై సభ్యులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రానికి నిధులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
ప్రధానంగా తమ హయాంలోనే అమరావతిని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు కచ్చితంగా శంకుస్థాపన చేసేలా కృషి చేయాలని ఎంపీలకు సూచించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం లభించేలా ప్రయత్నించాలని స్పష్టం చేశారు.
ఏపీ జీవనాడిగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 12,150 కోట్లతో శరవేగంగా పూర్తిచేసి, ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్రాభివృద్ధిలో గేమ్ ఛేంజర్ అవుతుందని, అందుకు కేంద్ర సాయం కోసం ఎంపీలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి నిధులు రాబట్టాలని, విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం లభించేలా చూడాలన్నారు.
రాష్ట్రానికి కేంద్ర పథకాలు ఏ విధంగా ఉపయోగపడతాయో అధ్యయనం చేసి సంబంధిత శాఖా మంత్రులకు తెలపాలని సూచిస్తూ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, ఎంపీ, కలెక్టర్, ఎస్పీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్లమెంటు సమావేశాల్లో పూర్తి హాజరు తప్పనిసరిగా ఉండాలని, మిగతా సమయాల్లో నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.
తిరుమలలోని ఈ పెయింటింగ్ ఏమిటో తెలుసా? - 90శాతం మంది భక్తులు ఫెయిల్!