How To Modify Mistakes in Food Security Card:ప్రస్తుతం ఆధార్ కార్డు, పాన్ కార్డు మాదిరిగానే రేషన్ కార్డు కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటని చెప్పుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ సంక్షేమ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అయింది. మరీ.. ముఖ్యంగా తక్కువ ధరకే రేషన్ దుకాణం నుంచి నిత్యావసర సరుకులు లభిస్తాయి. అలాగే అడ్రస్ ప్రూఫ్‌గా కూడా రేషన్ కార్డు పని చేస్తుంది. అయితే, తెలంగాణలో గత కొంతకాలంగా కొత్త రేషన్ కార్డుల(Ration Cards) జారీ లేకపోవడంతో రేషన్ కార్డులు లేనివారు పలు విధాలుగా నష్టపోతున్నారు. ఎందుకంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఎలాంటి లబ్ధి పొందాలన్నా.. రేషన్ కార్డు ఉండి అందులో పేరు తప్పనిసరిగా ఉండాలి.
ముఖ్యంగా చాలా మంది పేరెంట్స్ తమ కార్డులో పిల్లల పేర్లు యాడ్ చేసుకోవాలని ఎదురుచూస్తున్నారు. అలాగే.. రేషన్ కార్డులో కొత్తగా పెళ్లైన కొడుకు పేరు ఉండి కోడలి పేరు లేని వారు చాలా మందే ఉన్నారు. అయితే, కుటుంబ సభ్యులకు రేషన్ కార్డు ఉండి.. అందులో పేరు లేని వారి కోసం తెలంగాణ సర్కార్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. అందుకోసం అప్లికేషన్స్ స్వీకరిస్తుంది. అంతేకాదు.. మీ రేషన్ కార్డుకు సంబంధించి ఏమైనా తప్పులు ఉన్నా సవరించుకోవచ్చు. అంటే.. అడ్రస్ మార్చుకోవడం, పేర్లలో తప్పులు ఉంటే మార్చుకోవడం వంటివి చేసుకోవచ్చు. ఇంతకీ, రేషన్ కార్డులో కొత్తవారిని ఎలా యాడ్ చేసుకోవాలి? తప్పులు ఎలా సవరించుకోవాలి? ఏ ఏ ధ్రువపత్రాలు అవసరం? అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రేషన్ కార్డులో తప్పుల సవరణకు దరఖాస్తు విధానం ఇదే..
- రేషన్ కార్డు సవరణ, కొత్త మెంబర్ యాడింగ్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఫోన్లోనే ఇప్పుడే చెప్పే విధంగా ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- అందుకోసం మీరు ముందుగా 'Telangana Mee seva Portal'ని సందర్శించాలి. ఆ తర్వాత హోమ్ పేజీలో కనిపించే Services అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు ఓపెన్ అయిన పేజీలో Search for Services అనే బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Department అనే ఆప్షన్‌లోకి వెళ్లి Selectపై క్లిక్ చేసి Civil Supplies అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అనంతరం ఓపెన్ అయిన పేజీలో 'Corrections in Food Security Card' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే నెక్ట్ వచ్చే పేజీలో రైట్ సైడ్‌కి Download Application Form కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆ ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.