తెలంగాణ

telangana

ETV Bharat / state

వైరల్ వీడియో : నడిరోడ్డుపై ఏరులై పారిన మద్యం - బాటిళ్ల కోసం ఆశగా ఎదురుచూసిన జనం - COPS DESTROY LIQUOR IN MAHBUBNAGAR

500 కాటన్ల మద్యం సీసాలను లారీలతో తొక్కించిన ఆబ్కారీ శాఖ అధికారులు - ఏరులై పారిన మద్యం - ఆశగా ఎదురు చూసిన స్థానికులు

Cops Destroy Liquor In Mahbubnagar
Cops Destroy Liquor In Mahbubnagar (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 26, 2024, 11:20 AM IST

Updated : Oct 27, 2024, 6:09 PM IST

Cops Destroy Liquor In Mahbubnagar :కళ్ల ముందు ఒక విస్కీ బాటిలో, లేదంటే బ్రాందీ సీసానో ఉంటేనే ఎప్పుడు దాని మూత తీసి గొంతు తడిచేసుకుందామా? అని మందుబాబులు ఆశగా ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఏకంగా వందలాది సీసాలను ఆబ్కారీ శాఖ అధికారులు లారీలతో తొక్కిస్తుంటే మద్యం ఏరులై పారింది. చేసేదేమీ లేక సెల్​ఫోన్​లో వీడియో తీస్తూ చూస్తుండిపోయారు మద్యం ప్రియులు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం రండి.

వివరాల్లోకి వెళితే మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల జాతీయ రహదారిపై ఈ నెల 23న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మద్యం సీసాలతో వెళ్తున్న ఓ లారీ బోల్తా పడింది. లారీ ప్రమాదంలో కొన్ని మద్యం కాటన్లు డ్యామేజ్​ అయ్యాయి. డ్యామేజ్​ అయిన వాటిని నేడు వేరుచేసి, మద్యం బాటిళ్లను రోడ్డుపై వేసి లారీతో తొక్కించారు ఆబ్కారీ శాఖ అధికారులు. దాంతో ఆ ప్రాంతమంతా మద్యం ఏరులై పారింది. కొంతమంది ఇందుకు సంబంధించిన దృశ్యాలను సెల్​ఫోన్​లో వీడియో తీశారు. కాగా సుమారు 500 కాటన్ల వరకు మద్యం బాటిళ్లు ధ్వంసం అయి ఉంటుందని అధికారులు తెలిపారు.

Last Updated : Oct 27, 2024, 6:09 PM IST

ABOUT THE AUTHOR

...view details