తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండ్రోజుల్లో కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం - ఆ విభాగం వారికి ట్రైనింగ్ ఇప్పుడు లేనట్టే

Constable Training in Telangana : పోలీస్‌ కానిస్టేబుళ్ల శిక్షణకు సర్వం సిద్దమైంది. పోలీస్‌ అకాడమీతో పాటు 28 కేంద్రాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21 నుంచి శిక్షణ మొదలుకానుంది. మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక మైదానాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు టీఎస్​ఎస్పీ బెటాలియన్లు, పోలీస్‌ శిక్షణా కళాశాలలు, జిల్లా కేంద్రాలు, నగర శిక్షణ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

28 Centers For Constable Training
Government Focus on Constable Training in Telangana

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 8:07 AM IST

రెండు రోజుల్లో కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం ఆ విభాగం వారికి ఇప్పుడు లేనట్టే

Constable Training in Telangana : రాష్ట్రంలో కానిస్టేబుళ్ల శిక్షణ ప్రక్రియ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. పోలీస్‌ శాఖకు చెందిన సివిల్‌, ఏఆర్‌, ఎస్​ఏఆప్​సీపీఎస్​, టీఎస్​ఎస్పీ విభాగాలకు 13వేల 444 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. రాష్ట్రంలోని 28 శిక్షణ కేంద్రాల్లో దాదాపు 11వేల మంది శిక్షణకు సరిపడ వసతులే ఉండడంతో టీఎస్​ఎస్పీ విభాగం కానిస్టేబుళ్ల శిక్షణను తాత్కాలికంగా వాయిదా వేశారు.

ఈ క్రమంలో వారిని మినహాయించి మిగిలిన వారికి రెండురోజుల్లో శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా ప్రిన్సిపాళ్లకు శిక్షణ విభాగం నుంచి ఆదేశాలు వెళ్లాయి. పోలీస్‌ నియామక మండలి నిర్వహించిన అర్హత పరీక్షల తుది ఫలితాలు అక్టోబరులో వెలువడినా న్యాయపర వ్యాజ్యాలతో తుదిఎంపిక జాప్యమైంది. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Distributed Constable Selection Papers) ఈ నెల 14 న ఎల్​బీ స్టేడియంలో కానిస్టేబుళ్లకు ఎంపిక పత్రాలను అందజేయడంతో శిక్షణ విభాగం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటా - కేసీఆర్​ ఎలా వస్తారో చూస్తా : రేవంత్​ రెడ్డి

Telangana Constable Training 2024 : నోటిఫికేషన్‌లో కానిస్టేబుళ్ల సంఖ్య 5వేల10 అయితే మిగిలిన విభాగాలుపోను వారిలో సగం మందికే శిక్షణ ఇచ్చేందుకు వసతులున్నాయి. అందరికీ ఒకేసారి శిక్షణ ఇవ్వాల్సి ఉండగా టీఎస్​ఎస్పీ(TSSP Constable Training)ని శిక్షణ నుంచి ప్రస్తుతం మినహాయించారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్​పీఎఫ్​తో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక పోలీస్‌ శాఖలకు లేఖలు రాసిన అధికారులు అక్కడి కేంద్రాల్లో అనుమతివ్వాలని కోరారు. కుదరని పక్షంలో 9 నెలల పాటు జరిగే ఇతర కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తి అయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

జీవో 46 రద్దు చేయండి - ధర్నాచౌక్​ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన

అనుమతి లభిస్తే టీఎస్​ఎస్పీ కానిస్టేబుళ్లకు శిక్షణ సైతం ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. పోలీస్‌ అకాడమీ(Telangana Police Academy)లో ఇప్పటికే 500 మందికిపైగా ఎస్సైలు ఉండగా అక్కడ మరో 653 మంది మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వనున్నారు. వరంగల్‌ పీటీసీలో వెయ్యి మంది సివిల్‌ విభాగం మహిళా కానిస్టేబుళ్లకు, మేడ్చల్‌ పీటీసీలో 400 మంది ఏఆర్​ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

2ఫోన్లలో 7వేల మంది డిటైల్స్​- ఎవరికి బ్లడ్​ కావాలన్నా కానిస్టేబుల్​కు కాల్​ చేస్తే చాలు!

ఎస్​ఎస్​సీ భారీ నోటిఫికేషన్​ - పదో తరగతి అర్హతతో 75,768 జీడీ కానిస్టేబుల్ పోస్టులు!

ABOUT THE AUTHOR

...view details