Secunderabad Cantonment By Election Result 2024: రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగింది. 17 లోక్సభ స్థానాలతో పాటు జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నిక లెక్కింపు ప్రక్రియ కూడా జరిగింది. ఈ ఎన్నికలో అధిక మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ గెలిచారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో హస్తం పార్టీ బోణి కొట్టినట్లయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున లాస్య నందిత సోదరి నివేదిత, బీజేపీ అభ్యర్థిగా టీఎన్. వంశ తిలక్ సహా 15 మంది పోటీలో పాల్గొన్నారు.
Cantonment Assembly By Election Counting 2024 : ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మే 13వ తేదీన ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. అందులో 2,53,706 మంది ఓటర్లు ఉంటే 1,30,929 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 47.85 శాతం ఓట్లు పోలవగా, ఈసారి 51.61 శాతం నమోదైంది. మొత్తం 17 రౌండ్లలో ఓట్లు లెక్కింపులో భాగంగా 14 టేబుళ్లు ఈసీ ఏర్పాటు చేసింది. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెెక్కింపుతో ప్రక్రియ మొదలైంది. అనంతరం పలు రౌండ్లలో జరిగిన లెక్కింపులో చివరగా కాంగ్రెస్ అభ్యర్థి విజేతగా నిలిచారు.