Cong Govt Speed up in Sitarama project :గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాలోని పంటల సాగుకు నీళ్లందించాలనే లక్ష్యంతో సీతారామా ప్రాజెక్టు పనులు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం నుంచి ప్రారంభమైన ప్రధాన కాలువల పనులు చాలా వరకు పూర్తయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిజైన్‌లో కొంత మార్పులు చేసి సాగర్ ఆయకట్టుకు పాలేరు నుంచి కాకుండా మధ్యలోనే ప్రత్యేకంగా అనుసంధాన కాలువ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకోసం రూ.100 కోట్లు కేటాయించి ప్రాజెక్టు పనులు చేపట్టింది. జూలూరుపాడు మండలం వినోభానగర్ వద్ద సీతారామ ప్రధాన కాలువ నుంచి ఏన్కూరు సమీపంలో ఎన్ఎస్పీ సాగర్ కాలువ వరకు తవ్వకానికి ప్రతిపాదన చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి సారించి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తుండటం, స్వయంగా కాలువల నిర్మాణం పనులు పరిశీలించి దిశానిర్దేశం చేస్తుండటంతో పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి.
రూ.100 కోట్లతో సీతారామ ప్రాజెక్ట్ కాలువ అనుసంధానం పనులకు శంకుస్థాపన
"సీతారాం ప్రాజెక్టు కింద మా పొలాలు పోతున్నాయి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకూ పరిహారం గురించి ఎలాంటిది చెప్పలేదు. అధికారులు వచ్చి మీ భూములను తీసేస్తాం, తరువాత చెప్తాం అంటున్నారు. మేము ముందు ప్యాకేజీ చెప్పిన తర్వాత కాలువ పనులు మొదలు పెట్టాల్సిందిగా కోరాం. అధికారులను, ఎమ్మెల్యే, మంత్రిని పరిహారం గురించి అడిగితే సమాధానం చెప్పడం లేదు. పొలాలు భూములు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారంపై హామీ ఇవ్వాలి. ఆయకట్టు కింద నీళ్లు ఇవ్వాలి." - బాధిత రైతులు