Comic Con Exhibition in Hyderabad 2024 :ఆపదలో చిక్కుకున్న వారిని స్పైడర్ రూపంలో ఉండే వ్యక్తి సాహసించి రక్షిస్తాడని మనం సినిమాలో చూసే ఉంటాం. ఒక ప్రాంతాన్ని, దేశాన్నికానీ ఎవరైన ఇబ్బందులకు గురి చేసినా ప్రజలందరికి రక్షించడానికి సూపర్ హిరోలు అందరు ఏకమై దేశాన్ని కాపాడుతారు ఈ తరహా చిత్రాలను చిన్నపెద్ద తేడా లేకుండా చూస్తుంటారు. కామిక్ పాత్రలకు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. నేటి కాలంలో కామిక్ షోలు అనేకం వస్తున్నా స్పైడర్ మాన్, సూపర్ మ్యాన్, హల్క్, ఐరన్ మ్యాన్ (Iron Man) లాంటి క్యారెక్టర్లకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఇలాంటి ఎన్నో కామిక్ క్యారెక్టర్లకు హైటెక్స్ వేదికగా నిలిచింది. క్రించిరోల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కామిక్ కాన్కు విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి పిల్లలు, యువకులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.
Hyderabad Comic Con Exhibition : కామిక్ షోలో ఉండే వివిధ పాత్రలకు కేవలం చిన్నారులే కాదు వైద్యులు, ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అభిమానులుగా ఉన్నారు. ఆ పాత్రలపై అభిమానం చాటుకునేలా వివిధ కామిక్ క్యారెక్టర్ల వేషధారణలో వచ్చారు. కామిక్ షోలో పాల్గొన్న వారందరూ తమ నిజ జీవితంలో ఊహించుకుంటున్నారు. వారిలో పాఠశాల విద్యార్థుల నుంచి వృత్తి నిపుణుల వరకు ఆసక్తికరమైన వేషధారణలో వచ్చి అక్కడున్న వారిని ఆకట్టుకున్నారు.
"చిన్నప్పటి నుంచి కామిక్ షోలు చూస్తున్నాం. అందులో కొన్ని క్యారక్టర్స్ చాలా ఆసక్తిగా ఉంటాయి. అలాంటి క్యారక్టర్స్ మమ్మల్ని ప్రభావితం చేస్తాయి. మేము కూడ అలా అవ్వాలి అనుకుంటాం. ఆ కామిక్ షో అనగానే మాకు నచ్చిన క్యారక్టర్ వేయాలి అనుకున్నాం. ప్రతి సంవత్సరం ఇందులో పాల్గొంటాం. ప్రొఫెషన్ వేరైనా మాకు నచ్చిన పాత్రల వేషాదారణ వేయడం చాలా ఆనందంగా ఉంది. చాలామంది మాతో ఫొటోలు తీసుకుంటున్నారు." - సందర్శకులు