తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇబ్బందులు రాకుండా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ - ఆ నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యం' - CM REVANTH ON SC CLASSIFICATION

ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్​ అనుకూలమన్న సీఎం రేవంత్​ రెడ్డి - గ్లోబల్​ మాదిగ డే -2024లో పాల్గొన్న సీఎం - ఇబ్బందులు రాకుండా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ

CM Revanth on SC Classification
CM Revanth on SC Classification (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2024, 5:21 PM IST

Updated : Dec 14, 2024, 8:03 PM IST

CM Revanth on SC Classification : ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్​ అనుకూలమని సీఎం రేవంత్​ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. చేవెళ్ల డిక్లరేషన్​ ద్వారా ఎస్సీ వర్గీకరణపై పార్టీ వైఖరి ఖర్గే తెలిపారన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు తమ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. హైదరాబాద్​లో నిర్వహించిన గ్లోబల్​ మాదిగ డే - 2024 కార్యక్రమానికి సీఎం రేవంత్​ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వారం రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై షమీమ్​ అక్తర్​ కమిషన్​ నివేదిక వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ చేస్తామని పేర్కొన్నారు. రాజకీయ, అధికార నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. చరిత్రలో తొలిసారి ఓయూ వీసీగా మాదిగను నియమించామని సీఎం రేవంత్​ రెడ్డి గుర్తుచేశారు.

"ఉస్మానియా యూనివర్సిటీకి వీసీగా మాదిగను 100 సంవత్సరాల చరిత్రలో మన ప్రభుత్వం నియమించింది. ఏ అవకాశం వచ్చినా రాజకీయ పరమైన, అధికారులకు సంబంధించి నియామకాలు ఏది చేపట్టిన మాదిగ సామాజిక వర్గానికి వారు అడగకుండానే వారు కావాల్సిన దానికన్నా ఎక్కువగానే ఇస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్యాయం జరగనివ్వదు. మీకు న్యాయం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. నేను ఎక్కడికి వెళ్లిన సరే యంగ్​ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాను. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకం తీసుకుంది. ఆ యూనివర్సిటీని పీపీపీ మోడల్​లో ప్రారంభించాం. అందులో కూడా పైడిపాటి దేవయ్యను బోర్డు మెంబర్​గా నియమించాం."- రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

'చిత్తశుద్ధితో గురుకులాల ప్రక్షాళన - ప్రతి నెల 10లోపు విద్యా సంస్థలకు నిధులు'

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కీలక తీర్పు - పార్టీలకతీతంగా స్వాగతించిన నేతలు - SC ST SUB CLASSIFICATION

Last Updated : Dec 14, 2024, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details