CM Revanth Reddy Review on Pending Irrigation Projects : పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధ్యయానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పటిష్ఠత, కుంగిపోయిన పిల్లర్లపై అధ్యయనం చేయించాలని అధికారులను ఆదేశించారు.
కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌లో రూ.లక్షతో పాటు తులం బంగారం
CM Revanth on Kaleshwaram Project :కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇరిగేషన్ ఇంజినీర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల్లో నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. సాంకేతికంగా అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలపై నిర్ణయం తీసుకోనున్నట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లకు రూ.10కోట్ల వరకు ఖర్చయినా ఆలోచించవద్దని తెలిపారు.
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులకు మొదటి ప్రాధాన్యమిచ్చి గ్రీన్ చానెల్ ద్వారా వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తయితే సుమారు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చునని తెలిపారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.