Water Problem in Osmania University :ఉస్మానియా యూనివర్సిటిలో నీటి ఎద్దడి, విద్యుత్ కొరత ఉండదనే నోటీసుపై విద్యార్థులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోతలు ఉండవని చెప్పిన సీఎం మాటలకు విలువలేదా అని ప్రశ్నించారు. యూనివర్సిటీ చరిత్రలో ఏనాడు నీరు, కరెంటు ఎద్దడి లేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంట్ కోత, నీళ్ల కొరత మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీళ్ల కొరత, విద్యుత్ సరఫరాలో అంతరాయం వంటి కారణాలతో ఇప్పటికే యూనివర్సిటీని బంద్ చేశారని, ఇక ఇప్పుడు మళ్లీ వర్సిటీకి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పరీక్షలకు సమయం దగ్గరకు వస్తున్న సమయంలో వర్సిటీకి సెలవులు ప్రకటించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే లేడీస్ హాస్టల్‌లో విద్యార్థినులు నీటి సమస్యపై రోడెక్కిన విషయం తెలిసిందే. మానేరు హాస్టల్లో ఆర్వో ప్లాంటు పాడైపోయిందని నీటి సమస్యపై చీఫ్ వార్డెన్ కార్యాలయం ముందు నిరసన కూడా చేశారు. తాజాగా వర్సిటీ విద్యార్థులు తమకు తాగునీరు అందడం లేదని, విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని వాపోయారు.
CM Revanth Reddy on Water Problem In OU :ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టారనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లో, తాజాగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
Student Unions Fight in OU : ఓయూలో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ