CM Revanth Reddy On Pink Power Run Program :మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటంబం, సమాజం సంతోషంగా ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన పింక్ పవర్ రన్ చాలా గొప్ప కార్యక్రమమని కొనియాడారు. మహిళా సాధికారత కోసం రాష్ట్రప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోందని వివరించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'పింక్ పవర్ రన్ 2024' కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని సీఎం తెలిపారు. వైద్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీఠవేస్తోందని అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు సుధారెడ్డి పౌండేషన్ ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు సుధారెడ్డికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పింక్ పవర్ 5కె, 10కె రన్లో గెలుపొందిన వారికి సీఎం రేవంత్ రెడ్డి నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి పీఏసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ, శాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి తదితరులు హాజరయ్యారు.