Lok Sabha Elections 2024 :దేశంలో గొప్ప మార్పునకు తుక్కుగూడలో నాంది పలికామని, సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశానికి సంబంధించిన మ్యానిఫెస్టోను తుక్కుగూడ నుంచే ప్రకటించామన్నారు. ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కావని, ఓటు వేసేటప్పుడు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. గత 17 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నడూ లేని ప్రమాదం ఇప్పుడు వచ్చిందని ఆయన హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే రిజర్వేషన్లు తీసేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మోదీ చించేయాలని చూస్తున్నారు : రాహుల్ గాంధీ - Rahul Gandhi Election Campaign
బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసేయడం పక్కా అని ధ్వజమెత్తారు. ప్రజలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తే, దిల్లీ నుంచి పోలీసులను పంపిస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కూడా ఒక వ్యక్తి తనని జైల్లో పెట్టారని, తర్వాత ఏం జరిగిందో ఆయన్ని అడగాలంటూ తెలిపారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని దుయ్యబట్టారు.
మొన్నటి సెమీఫైనల్లో బీఆర్ఎస్ను బొంద పెట్టారని, ఇప్పుడు ఫైనల్లో బీజేపీని బొంద పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. తుక్కుగూడలో ఏ కార్యక్రమం చేసిన విజయమే వరిస్తుందని పేర్కొన్నారు. ఇక్కడే జాతీయ మ్యానిఫెస్టో విడుదల చేశాక మోదీ షా లకు నిద్ర లేదని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలవడానికి దేవుడి పేరుతో బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు. మనం హిందువులం కాదా అని, మనం మైసమ్మ, పోచమ్మలకు కోడి కోసినం కల్లు పోసినమన్నారు. వీళ్లు వచ్చి మనకు నేర్పాలా? అని మండిపడ్డారు.
రాముడి ప్రతిష్ఠ కాకముందే, రేషన్ బియ్యానికి పసుపు కలిపి అక్షితలు అన్నారని, ఇది అబద్దం కాదని రాముని మీద ఒట్టేసి చెబుతారా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. మీకు దేవుడు అంటే ఓట్లని, మాకు మాత్రం దేవుడని స్పష్టం చేశారు. దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలన్నారు. అలాంటివారే నిజమైన హిందువని, బీజేపీ వాళ్లు దేవుని పేరిట రాజకీయం చేసే దివానాకోరులని మండిపడ్డారు.
హామీలు అమలుకాలేవంటున్న కేటీఆర్, అందంగా ముస్తాబై చీర కట్టుకొని బస్ ఎక్కాలని, నిన్ను టికెట్ అడిగితే మా ఆరు గ్యారెంటీలు అమలు కానట్టేనని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఉందని, అందుకే మీ దగ్గరికి వచ్చామన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా, కందుకూరుకు మెట్రో రావాలంటే, మూసీ సుందరీకరణ కావాలంటే రంజిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
"సూరత్ నుంచి వచ్చిన మోదీ, అమిత్‌షా పార్టీల మధ్య చిచ్చుపెడుతున్నారు. రిజర్వేషన్లను రద్దు చేసి దేశాన్ని అదానీ, అంబానీలకు తాకట్టుపెట్టాలని చూస్తున్నారు. రిజర్వేషన్లపై ప్రశ్నించిన నన్ను జైలులో పెట్టాలని దిల్లీ పోలీసులను పంపించారు". - రేవంత్ రెడ్డి, సీఎం
దేశాన్ని అదానీ, అంబానీలకు తాకట్టుపెట్టాలని చూస్తున్నారు : సీఎం రేవంత్ రెడ్డి (Etv Bharat) షెడ్డుకు పోయిన కారును తూకానికి అమ్మాల్సిందే : సీఎం రేవంత్రెడ్డి - Congress janajathara sabha gadwal
డీకే అరుణ రాష్ట్రప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు : సీఎం రేవంత్ - CM Revanth Redddy Election Campaign