తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్టీ నేతలతో నేడు రేవంత్​ భేటీ - ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చ - CM Revanth Meet with Party Leaders - CM REVANTH MEET WITH PARTY LEADERS

CM Revanth Review With Party Leaders : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంపై అధికార కాంగ్రెస్‌ నాయకత్వం దృష్టి సారించింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నా, అదే స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లటంలో పార్టీ నాయకులు దృష్టి సారించటంలేదని పీసీసీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ ప్రజాభవన్‌లో సమావేశం కానున్న సీఎం, కాంగ్రెస్‌ నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు.

CM Revanth Focus on Party Development
CM Revanth Reddy Meeting with Party Leaders (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 17, 2024, 7:07 AM IST

CM Revanth Reddy Meeting with Party Leaders : పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ను గద్దె దించి, పాలనాపగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు పథకాల అమలుకు విస్తృత చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆరు గ్యారంటీల్లో ఒక్కో పథకం అమలు, రుణమాఫీ, ఉద్యోగాల భర్తీతో పాటు ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యకమాల అమల్లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం చర్యలు చేపడుతోంది.

ఇప్పటికే గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తుండగా, తాజాగా కీలకమైన రైతుల రుణమాఫీకి సిద్ధమైంది. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా తమదైన మార్క్‌ చూపించే విధంగా కృషి చేస్తున్నా, ప్రభుత్వ కార్యక్రమాలు అదేస్థాయిలో ప్రజల్లోకి వెళ్లటంలేదని, అటు అధిష్ఠానంతో పాటు సీఎం, మంత్రులు భావిస్తున్నారు.

ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పలేకపోవటంపై అసంతప్తి :కీలకమైన నిర్ణయాలతో పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా, ప్రజల్లోకి తీసుకెళ్లటంలో మాత్రం కిందిస్థాయిలో పార్టీ నాయకత్వం వైఫల్యం చెందుతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నా, ఇటీవల నెలకొన్న పరిణామాల వేళ ప్రతిపక్షాల విమర్శలను తమ పార్టీ నేతలు తిప్పికొట్టలేకపోయారని భావిస్తున్నారు.

ఓ వైపు ఆరు గ్యారంటీల అమలు, ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు, తాజాగా రైతు రుణమాఫీ, త్వరలోనే రైతుభరోసాపై విధివిధానాల ఖరారు నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకత్వం ఉత్సాహంగా ముందుకెళ్లకపోవటం తమకు నష్టం జరుగుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఎమ్మెల్యేల చేరికల విషయంలోనూ అటు బీఆర్ఎస్, బీజేపీ విమర్శలకు ధీటుగా స్పందించకపోవటం పట్ల పార్టీ నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

CM Revanth Focus on Party Development : ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే, ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేలా కాంగ్రెస్‌ అగ్రనేతలు తమ నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజాభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్‌ మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం, ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ - ప్రజా సంక్షేమంపై సుదీర్ఘ మంతనాలు - CM meeting with Collectors SPs

పాస్‌బుక్‌ ఆధారంగానే రైతు రుణమాఫీ - ఎల్లుండిలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ! - CM REVANTH CLARIFIED ON LOAN WAIVER

ABOUT THE AUTHOR

...view details