CM Revanth Reddy Meeting Employees Unions : పదేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదని, వారి ఆవేదన వినేవారు లేక ఇబ్బందులు పడ్డారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచిందని చెప్పారు వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్‌రెడ్డి వివరించారు.
ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ ఉద్దేశం: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth on Employees Unions :ఇన్నాళ్లు సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నది, అధికారంలో ఉన్నది కేసీఆర్ కుటుంబమేననిరేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) విమర్శించారు. నిర్బంధాలతో పాలన సాగిస్తామని అనుకోవడం వారి భ్రమని మండిపడ్డారు. ఎంసీహెచ్‌ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. సుమారు మూడున్నర గంటల పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంలతో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
'ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం. దీనిపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలల్లో కిందిస్థాయి సిబ్బందిని నియమిస్తాం. ఉద్యోగుల డీఏతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మంత్రివర్గ ఉపసంఘం శాఖల వారీగా సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుంది. సంఘాలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోమని' రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో మాట్లాడి ప్రొఫెసర్ కోదండరాంను (Kodandaram) శాసనమండలికి పంపుతామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయన ఎమ్మెల్సీగా ఉంటే మండలికి గౌరవంగా ఉంటుందని అన్నారు. ఉద్యోగుల డీఏతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు విశ్వాసం కల్పించడానికే ఈ సమావేశం నిర్వహించామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.