తెలంగాణ

telangana

ETV Bharat / state

'దేశ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర తగ్గుతోంది - కేంద్ర కేబినెట్​లో మనవాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి' - telugu role in national politics

CM Revanth on National Politics : జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమంగా తగ్గుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మనవాళ్లుగా మనమంతా కలిసి ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఇవాళ ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు రచించిన ‘గవర్నర్​పేట్​ టు గవర్నర్స్ హౌజ్​’​ పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు.

Telugu People Role in National Politics
CM Revanth on National Politics

By ETV Bharat Telangana Team

Published : Mar 3, 2024, 10:45 PM IST

కేంద్ర కేబినెట్​లో మనవాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది- జాతీయ రాజకీయాలపై సీఎం వ్యాఖ్యలు

CM Revanth on National Politics : కేంద్ర కేబినెట్​లో మనవాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth) పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమంగా తగ్గుతోందని ఆయన తెలిపారు. గతంలో నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ తదితర నాయకులు జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారన్నారు. ఎంసీహెచ్ఆర్డీలో మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు రచించిన ‘గవర్నర్​పేట్​ టు గవర్నర్స్ హౌజ్​’​ పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులుగా పనిచేసి ఎంతో అవగాహన పొందిన పెద్దలందరిని కలుసుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. జాతీయ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు తెలుగు వారి ప్రాధాన్యతను కొంతవరకు నిలబెట్టారని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కనిపించడం లేదన్నారు. ఇది మన మనుగడకు, గుర్తింపునకు మంచి పరిణామం కాదన్నారు. T

Telugu People Role in National Politics : మనవాళ్లుగా మనమంతా కలిసి ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో హిందీ తరువాత అత్యధికంగా తెలుగు భాష మాట్లాడుతారని ఆయన తెలిపారు. రాష్ట్రాలుగా విడిపోయిన, రాష్ట్ర అభివృద్ది కోసం అందరం కలిసి పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. సీనియర్ అధికారులు, అనుభవజ్ఞుల నుంచి తెలంగాణ ప్రభుత్వం సూచనలు తీసుకుంటుందని రేవంత్ తెలిపారు.

గతంలో నంద్యాలలో పీవీ పోటీ చేసినపుడు, తెలుగువాడు ప్రధానిగా ఉండాలని ఎన్టీ రామారావు, పీవీ నరసింహరావుపై(PV Narasimharao) తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టకుండా ఏకగ్రీవం చేసే ప్రయత్నం చేశారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. రాజకీయాల్లో అప్పుడప్పుడు ఒక మంచి సంప్రదాయాన్ని పాటించడంలో తప్పులేదని ఆయన పేర్కోన్నారు. తమ ప్రభుత్వం కూడా అలాంటి మంచి సంప్రదాయాన్ని పాటిస్తుందని వెల్లడించారు. అభివృద్ధిని ప్రజల చెంతకు చేరవేయడానికి, అందరి సహకారం ఉండాలని సీఎం రేవంత్ కోరారు.

ప్రభుత్వం, పోలీసు అధికారుల సమీక్షంలో పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని మాజీ గవర్నర్ రామ్మోహన్​రావు పేర్కొన్నారు. తను రచించిన పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తొమ్మిదిన్నర నెలలు సమయం పట్టిందన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న సమయంలో అనేక కేసులను సమర్థవంతంగా చేధించినట్లు ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్​గా, తమిళనాడు గవర్నర్​గా చేసిన సమయంలోని చాలా అంశాలను, గవర్నర్​పేట్​ టు గవర్నర్స్ హౌజ్ పుస్తకంలో పోందుపర్చినట్లు వెల్లడించారు.

ఇకపై జీహెచ్‌ఎంసీ కాదు - హైదరాబాద్ గ్రేటర్‌ సిటీ కార్పొరేషన్‌!

1969 తెలంగాణ పోరాటం పెద్ద ఎత్తున జరిగిందని, అప్పుడు తెలంగాణ ఎందుకు రాలేదో చాలా అంశాలు ప్రజలకు తెలియదని ఆయన అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విభజనకు సంబందించిన ప్రతి అంశం పుస్తకంలో పొందుపరచినట్లు తెలిపారు. నీలం సంజీవరెడ్డి, పీ.వీ నర్సింహారావు, అంజయ్య ముఖ్యమంత్రులుగా సమయంలో తనకు పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న కుల రాజకీయాలపై వంటి అంశాలను గవర్నర్పెట్ టూ గవర్నర్ హౌస్ పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు.

"జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమంగా తగ్గుతోంది. కేంద్ర కేబినెట్​లో మనవాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ తదితర నాయకులు జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. మనవాళ్లుగా మనమంతా కలిసి ప్రయాణం మొదలుపెట్టాలి".- రేవంత్​రెడ్డి, సీఎం

రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై చర్చ అవసరం : సీఎం రేవంత్​

వచ్చే లోక్​సభ ఎన్నికలు - మోదీని ఓడించేందుకు జరుగుతున్న యుద్ధం : రేవంత్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details