తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు - సీఎం రేవంత్​ రెడ్డి ఆసక్తికర ట్వీట్

రైతు పండుగలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి - ట్విటర్‌ వేదికగా ఆసక్తికర ట్వీట్

CM Revanth Reddy will Participate in the Joint Palamuru Sabha
CM Revanth Reddy will Participate in the Joint Palamuru Sabha (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2024, 2:57 PM IST

Updated : Nov 30, 2024, 3:19 PM IST

CM Revanth Reddy will Participate in the Joint Palamuru Sabha : సరిగ్గా ఏడాది కింద మార్పు కోసం కాంగ్రెస్‌పై విశ్వాసంతో అధికారాన్ని కట్టబెట్టిన అన్నదాతలతో కలిసి రైతు పండుగ చేసుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. రాష్ట్రంలో రైతన్న బాగు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివరాలను ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. రైతుల సంతోషంలో పాలు పంచుకోవడం కోసం ఉమ్మడి పాలమూరు సభలో పాల్గొంటానని వివరించారు.

ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో వారికే తొలి ప్రాధాన్యం - అదనపు గదులకు అనుమతి

వారు మాపై పెట్టుకున్న నమ్మకం : సంవత్సరం కిందట సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు, పోలింగ్‌ బూతుకు వెళ్లి మార్పు కోసం ఓటేశారని గుర్తు చేశారు. ఆ ఓటు అభయ హస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందని వివరించారు. రైతును రాజుగా మార్చేందుకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, రూ.7,625 కోట్ల రైతు భరోసా, ధాన్యానికి రూ.1,433 కోట్లు, రైతు బీమా చెల్లించినట్లు వివరించారు. రూ.95 కోట్ల పరిహారం, రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లకు మొత్తం కలిపి ఒక్క ఏడాదిలో రూ.54 వేల కోట్లు ఖర్చు చేసి, రైతుల జీవితాల్లో పండుగ తెచ్చామని పేర్కొన్నారు. ఇది సంఖ్య కోసం చెబుతున్నది కాదని, రైతులు తమపై పెట్టుకున్న నమ్మకమని వివరించారు.

మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరులో నిర్వహిస్తున్న రైతు పండుగ ముగింపునకు సీఎం రేవంత్‌ రెడ్డి శనివారం హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే అమిస్తాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభకి సర్వసిద్ధమైంది ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 28 నుంచి 30వ తేది వరకూ రైతుపండగ వేడుకలని సర్కార్‌ నిర్వహిస్తోంది. ఆత్యాధునిక సాగుపద్ధతులు, లాభసాటి పంటలు వ్యవసాయ యాంత్రీకరణ, అధునిక పోకడలపై కర్షకులకు అవగాహన కల్పించేందుకు 150కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. మూడో రోజూ కార్యక్రమాలు కొనసాగనుండగా ఉమ్మడి జిల్లా సహా చుట్టుపక్కల జిల్లా నుంచి రైతులని రప్పిస్తున్నారు.

ఈ సభలో కీలక ప్రకటన :హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో అమిస్తాపూర్ చేరుకోనున్న రేవంత్ తొలుత రైతు పండుగ ప్రదర్శనను తిలకిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలకు కనువిప్పు కలిగేలా ఆ సభ ఉండబోతోందని ఇప్పటికే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఏం చేసింది 10నెలల్లో కాంగ్రెస్ సర్కారు ఏం చేసిందో లెక్కలతో చెబుతామన్నారు. రుణమాఫీ, రైతు భరోసాకి సంబంధించి రైతులకు సీఎం తీపి కబురు అందిస్తారని, విధాన పరమైన నిర్ణయాలను సభా వేదికగా ప్రకటిస్తారని మంత్రులు చెబుతూవచ్చారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన దాదాపు 3లక్షల మంది రైతులకు రూ.3వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ విడతలో అందిచనుంది.

మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం - జనవరి తొలివారం నుంచి పాదయాత్ర : ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి

'ఏ బీజేపీ పాలిత రాష్ట్రంతో పోల్చినా తెలంగాణదే రికార్డు' : మోదీ విమర్శలకు రేవంత్ కౌంటర్

Last Updated : Nov 30, 2024, 3:19 PM IST

ABOUT THE AUTHOR

...view details