ETV Bharat / state

'జబ్బు ఏదైనా మేం నయం చేస్తాం' : రోగులను తప్పుదోవ పట్టిస్తున్న అక్రమార్కులపై 176 కేసులు

రకరకాల ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న అక్రమర్కులు - కొందరైతే అనుమతులు లేకుండానే ఔషధ దుకాణాల నిర్వహణ - ఝలక్ ఇచ్చిన డీసీఏ

DRUG CONTROL AUTHORITY
FAKE ADVERTISEMENTS ON TABLETS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 17 hours ago

Drug Control Authority : మీ కిడ్నీల్లో రాళ్లున్నాయా? ఈ మందు తీసుకుంటే రాళ్లన్నీ మటుమాయం. షుగర్​తో తీవ్రంగా బాధపడుతున్నారా? ఈ గోలీలు వేసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. ఈ మందులు వాడితే క్యాన్సర్‌ పూర్తిగా నయం అవుతుంది. ఇలా రకరకాల ప్రకటనలతో రోగులను తప్పుదోవ పట్టిస్తున్న అక్రమార్కులకు ఔషధ నియంత్రణ శాఖ (డీసీఏ) షాక్​ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రకటనలిస్తున్న వారిపై ఏకంగా 176 కేసులు నమోదు చేసింది.

రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారి లాభాపేక్షకు అడ్డుకట్ట వేసింది. ఇవే కాకుండా పలు రకాల అంశాలకు సంబంధించి మొత్తం 494 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సైతం మెరుపు దాడులు జరిపారు. వివరాలను ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ కమలాసన్‌ రెడ్డి సోమవారం (డిసెంబర్ 02)న వెల్లడించారు.

ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న మందుల విలువ దాదాపు రూ.3 కోట్ల 6 లక్షలు ఉంటుందన్నారు. చాలా మంది డీసీఏ (డ్రగ్​ కంట్రోల్​ అథారిటీ) నుంచి అనుమతులు తీసుకోకుండానే మెడికల్​ షాపులు నిర్వహిస్తున్నారు. కొందరు ఆర్‌ఎంపీల పేరుతో వైద్య సేవలు అందిస్తూ వారి వద్దే మందుల నిల్వలు ఎక్కవగా స్టోర్​ చేసుకుంటున్నారు. కొందరైతే అనుమతులు లేకుండానే మందులను తయారు చేసి అడ్డదారుల్లో, అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు డీసీఏ గుర్తించింది.

ప్రధానంగా నమోదైన కేసులు

  • మందులపై తప్పుడు ప్రకటనలు- 176
  • మందుల అక్రమ నిల్వ- 124
  • అధిక ధరలకు అమ్మకాలు- 75
  • అనుమతుల్లేకుండా విక్రయాలు-61
  • అనుమతులు లేకుండా మందుల తయారీ- 41
  • నకిలీ మందుల విక్రయాలు-8
  • లైసెన్స్‌ లేకుండా కాస్మోటిక్స్‌ తయారీ- 5
  • ఇతర కేసులు- 4

ముద్రిత ధర రూ.6గా ఉంటే అమ్మకం మాత్రం రూ.100 : అలెర్జీ కోసం వాడే అవిల్‌ ఇంజక్షన్‌ ఎమ్మార్పీ రూ.6.16 అయితే ఇక్కడ రూ.100 ఛార్జ్​ చేస్తున్నారు. కొన్ని మెడికల్​ షాపుల్లో ఎమ్మార్పీ ధరలో 10 నుంచి 20 శాతం డిస్కౌంట్​ కూడా ఇస్తుంటారు. అయితే ప్రైవేట్ హస్పిటల్స్​కు అనుసంధానంగా ఉన్న మెడికల్​ దుకాణాలు ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి.

రాష్ట్రంలో మెడికల్‌ మాఫియా ఆగడాలు ఎక్కువవుతున్నాయని, ప్రజల రక్తాన్ని కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు మెడికల్‌ దుకాణాల రూపంలో జలగలుగా తాగేస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Generic Medicine: 'మందుల చీటీలో బ్రాండ్ల పేర్లతో ఔషదాలు రాయొద్దు.. రాశారంటే'

బత్తిని పేరుతో నకిలీ మెడిసిన్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.