ETV Bharat / entertainment

నాగచైతన్య - శోభిత పెళ్లికి ప్రభాస్, పుష్ప రాజ్​!​ - ఇంకా ఎవరెవరు వస్తున్నారంటే?

చివరి దశకు వచ్చిన నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ వేడుక - గెస్ట్​ లిస్ట్ ఇదే.

NagaChaitanya Sobhita Dhulipala Marriage Guests List
NagaChaitanya Sobhita Dhulipala Marriage Guests List (source ETV Bharat and Nagarjuna X (Twittter))
author img

By ETV Bharat Telugu Team

Published : 17 hours ago

NagaChaitanya Sobhita Dhulipala Marriage Guests List : అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల మరికొద్ది గంటల్లో పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన పనులు కూడా చకచక జరిగిపోతున్నాయి. డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోస్‌ వేదికగా ఈ పెళ్లి వేడుక జరగనుంది. అయితే ఈ పెళ్లి వేడుకను సింపుల్​గా అతి తక్కువ మందితో జరపనున్నట్లు రీసెంట్​గా వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఈ వివాహా వేడుకకు ఎవరెవరు హాజరుకానున్నారనే విషయమై తాజా వార్తలు వచ్చాయి. సినీ, రాజకీయ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారట. 'పుష్ప 2'తో ఆడియెన్స్​ను అలరించడానికి సిద్ధమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, తన ఫ్యామిలీతో కలిసి ఈ వేడుకకు రానున్నట్లు తెలిసింది. ఇంకా రెబల్ స్టార్ ప్రభాస్‌, దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి సహా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నట్లు తెలిసింది.

పూర్తి సంప్రదాయ పద్ధతిలోనే - ఇకపోతే చైతన్య - శోభిత పెళ్లి వేడుక పూర్తి హిందూ సంప్రదాయ పద్ధతిలోనే జరగనుంది. దాదాపు ఏడెనిమిది గంటల పాటు ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన అన్ని క్రతువులు ఒకదాని తర్వాత ఒకటి నిర్వహిస్తారట.

'పుష్ప 3' కన్ఫామ్​​ - మూవీలో విజయ్ దేవరకొండ కూడా! - టైటిల్ ఏంటంటే?

'పుష్ప 2' - రష్మికకు ఆ సెంటిమెంట్​ కలిసొస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.