ETV Bharat / state

ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ డేట్ వచ్చేసింది - సీఎం చేతుల మీదుగా ఆరోజే శ్రీకారం

ఈ నెల 5వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం - ఒక్కో నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్ల కేటాయింపు

CONGRESS GOVT 6 GUARANTEES
MINISTER PONGULETI ON HOUSING SCHEEME (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 16 hours ago

Minister Ponguleti on Housing Scheeme : తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 5న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శ్రీకారం చుట్టబోతున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో మంగళవారం (డిసెంబర్ 03) వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్​తో కలిసి ఆయన విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా రూ.3 కోట్ల 62 లక్షల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

నియోజకవర్గానికి 3500 ఇళ్లు : అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 4 లక్షల 50 వేల ఇళ్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్లను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 6వ తేదీ నుంచి గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, లబ్ధిదారులను గుర్తించనున్నట్లు పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుంపటిగా మార్చిందని మండిపడ్డారు. ప్రతి నెల రూ.6 వేల 500 వందల కోట్లు అసలు, వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ కార్డు లేకున్నా అప్లై చేసుకోవచ్చు : రేషన్​ కార్డు లేని వారికి ప్రభుత్వం ఇటీవల గుడ్​ న్యూస్​ చెప్పింది. రేషన్ ​కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేసింది. మొదటి విడతలో వీరికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో వెల్లడించారు. రేషన్​ కార్డు లేని పేద ప్రజలకు ఇది నిజంగా శుభవార్తనే చెప్పాలి. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని క్యాంప్​ కార్యాలయంలో గత నెలల జరిగిన నియోజకవర్గ పరిధి సమావేశంలో ఈ ప్రకటన చేశారు. తిరుమలాయపాలెం మండలం కాంగ్రెస్​ శ్రేణులు, అధికారుల సంయుక్త సమావేశం నిర్వహించారు. పూర్తి కథనం కోసం ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేేసే వారికి గుడ్​న్యూస్​ - ఆ కార్డు లేకున్నా అప్లై చేసుకోవచ్చు చూసేయండి.

తెలంగాణకు రెండో రాజధాని! - అందుబాటులోకి మరో ఎయిర్​పోర్ట్!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.