తెలంగాణ

telangana

ETV Bharat / state

సాహసబాలుడు సాయిచరణ్​కు సీఎం రేవంత్​రెడ్డి సన్మానం - CM REVANTH APPRECIATES SAI CHARAN - CM REVANTH APPRECIATES SAI CHARAN

CM Revanth Appreciates Sai Charan For Saving Lives : రియల్​ హీరో సాయి చరణ్​ పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్​ శివారు నందిగామలోని ఓ ఫార్మా కంపెనీలో ఈనెల 26న భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అందులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్మికులను పదో తరగతి బాలుడు సాయిచరణ్​ రిస్క్​ చేసి కాపాడాడు. ఇవాళ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్​ బాలుడిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. అనంతరం రేవంత్​ రెడ్డి శాలువా కప్పి అతడిని అభినందించారు.

Revanth Reddy Praised boy who saved the fire workers
CM Revanth Appreciate to Sai Charan For Saving Life

By ETV Bharat Telangana Team

Published : Apr 28, 2024, 7:30 PM IST

CM Revanth Appreciates Sai Charan For Saving Lives :రంగారెడ్డి జిల్లా నందిగామలో రెండు రోజుల క్రితం అలెన్ హోమియో అండ్ హెర్బల్స్ ఫార్మాలో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు ప్రాణాలు కాపాడిని సాయిచరణ్ అనే బాలుడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. పొగ, చిన్న చిన్నగా మంటలు రావడం గమనించి ప్రమాదాన్ని ముందుగా గుర్తించిన 17 ఏళ్ల సాయిచరణ్‌, అగ్నిప్రమాద తీవ్రతను పసిగట్టి భవనం పైకి ఎక్కి తాడు కట్టాడు.

కిటీకి ద్వారా కార్మికులు కిందకు దిగేందుకు సాయచరణ్‌ సాయం చేశాడు. ఆరుగురు కార్మికులను కాపాడాడు. మరికొంత మందిని అప్రమత్తం చేశాడు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సైతం సాయి చరణ్​ను ప్రత్యేకంగా అభినందించారు. విషయం తెలుసుకున్న సీఎం రేంత్ రెడ్డి, ఇవాళ తన కార్యాలయానికి పిలిచి ఎమ్మెల్యే సమక్షంలో సాయిచరణ్​ను అభినందించి సత్కరించారు. సాహసం చేశావ్​రా బుడతా అని ప్రశంసించారు.

హెర్బల్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - సురక్షితంగా కాపాడిన అగ్నిమాపక సిబ్బంది - ఒకరికి గాయాలు - Fire accident

ABOUT THE AUTHOR

...view details