విశాఖ ఉక్కు ఊపిరి తీశారు మెడలు వంచుతామని కేంద్రం ముందు సాగిలపడ్డ జగన్ CM Jagan Neglects Visakha Steel Plant :ఆంధ్రుల హక్కుగా ప్రజల గుండెల్లో నిలిచిన విశాఖ ఉక్కును (Visakha Steel Plant) ఊచకోత కోసిన పాపం ముఖ్యమంత్రి జగన్‌దే. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పి కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రం ముందు సాగిలపడ్డారు. ప్రైవేటీకరణకు అడుగులు వేసిన కేంద్ర నిర్ణయాల కంటే దారుణంగా ఉక్కు ఊపిరి జగనే తీశారు. 1100 రోజుల్లో ఒక్కసారి కూడా ఉద్యమానికి సీఎం మద్దతు తెలపలేదు.
రుషికొండపై హడావుడిగా 'ప్యాలెస్' - వినియోగంపై స్పష్టతేదీ జగన్?
నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో బహిరంగ సభ : ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు స్టీల్ ప్లాంట్‌లో తలపెట్టనున్న న్యాయసాధన బహిరంగ సభకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇవ్వగా ఉక్కు పరిరక్షణకు డిక్లరేషన్‌ను, రైల్వే జోన్ అంశంపైనా ప్రకటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీ ప్రజలకు రూ.2.75 లక్షల కోట్లు ఇచ్చానని పదేపదే చెప్పే జగన్ (CM Jagan) విశాఖ ఉక్కుకు రూ.2000ల కోట్లు ఆర్థిక సాయం చేయకుండా ముఖం చాటేశారు. ఏటా రూ.25,000ల కోట్ల టర్నోవర్ ఉన్న విశాఖ ఉక్కు నుంచి జీఎస్టీ రూపంలో ఆంధ్రప్రదేశ్ వాటాగా రూ.2000ల కోట్లకు పైగా వస్తుంది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఏటా అందుకునే రూ.1100ల కోట్ల జీతభత్యాలపైనా పన్నుల రూపంలో ఖజానాకు జమ అవుతున్నాయి.
Visakha Steel Plant Workers Protest : అయినా ఉచితంగా వద్దు అప్పుగా రూ.500 కోట్ల చొప్పున 4 నెలలు ఆర్థిక సాయం చేసి ప్రతిగా ఉక్కు తీసుకెళ్లండి అంటూ ఉద్యోగ, కార్మికసంఘాల ప్రతినిధులు ఓ వినతి పత్రం ఇచ్చారు. పేదల ఇళ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు విశాఖ ఉక్కు తీసుకోవాలని కోరినా జగన్ కనికరం చూపలేదు. పైగా కంటితుడుపుగా ఓ అధికారి ఆధ్వర్యంలో కమిటీ వేసి సాధ్యాసాధ్యాలపై నివేదికలివ్వాలని చెప్పడం మరో మోసమే కదా అని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
అమరావతిని విచ్ఛిన్నం చేసేలా వైఎస్ఆర్సీపీ కుట్రలు- భూసేకరణ ప్రకటన ఉపసంహరణకు కసరత్తు
ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు (Vizag Steel Plant Privatization) కేంద్రం ముందుకెళ్తుంటే దాన్ని ఆపేందుకు సీఎం జగన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. తిరిగి తెరచాటున ఉక్కు పరిశ్రమ గొంతు కోసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కోపం వస్తుందోననే భయంతోనే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ప్రైవేట్ స్టీల్ కర్మాగారాలకు అడిగిన వెంటనే ఇనుప ఖనిజం, బొగ్గు గనులు కేటాయిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మాత్రం పట్టించుకోవడం లేదు. సీఎం జగన్ పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన పాపాన పోలేదు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు లేక ఎన్ఎండీసీ నుంచి ఇనుప ఖనిజం తెచ్చుకుంటోంది.
విశాఖ ఉక్కు కార్మికుల మహా గర్జన.. తగ్గేదేలే అంటున్న కేంద్రం
ఆగ'మేఘా'లపై అస్మదీయులకు మరో ప్రాజెక్టు - ఎన్నికల ప్రకటనకు ముందే జగన్ మాయ