CM Jagan Cheating Unemployed : ప్రతిపక్షలో ఉన్నప్పుడు ఇలా నోటికొచ్చినట్లు జగన్ మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 23 వేల ఖాళీలున్నట్లు జగన్ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక అదిగో డీఎస్సీ ఇదిగో డీఎస్సీ (AP DSC) అంటూ నాలుగున్నరేళ్లు ఊరించిన జగన్ ఇప్పుడు నిరుద్యోగులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. డీఎస్సీ వేయమంటే వెట్టిచాకిరి చేయాలంటూ ఆదేశాలిచ్చారు. ఎప్పుడో 12ఏళ్ల క్రితం రద్దు చేసిన అప్రెంటిషిప్‌ను విధానాన్ని మళ్లీ తీసుకొచ్చారు. ఒక పక్క డీఎస్సీ పోస్టుల్లో కోత వేసి మరోవైపు రెండేళ్లు తక్కువ జీతాలకు పని చేయించుకునే విధానాన్ని తీసుకొచ్చారు. డీఎస్సీలో 6,100 పోస్టులు, అప్రెంటిషిప్ విధానాన్ని పునరుద్ధరిస్తూ బుధవారం మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.
AP DSC Notification 2024 :టీడీపీ హయాంలో డీఎస్సీ-2018 ఇస్తే నాలుగున్నరేళ్లు ఏం గాడిదలు కాశారని విమర్శించారు. ఇప్పుడు ఆయన ఏం గాడిదలు కాశారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం 7,902 పోస్టుల భర్తీకి ప్రకటన ఇస్తే అంతేనా అన్న జగన్ ఇప్పుడు వాటి కంటే 1,802 పోస్టులు తగ్గించేశారు.
మెగా డీఎస్సీకి మంత్రి వర్గం ఆమోదం - కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి చెల్లుబోయిన
Unemployed Youth in AP :మెగా డీఎస్సీ అంటే ఇదేనా? అని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మండల, జిల్లా పరిషత్తు, పురపాలక బడుల్లో 1,88,182 పోస్టులు ఉంటే పని చేస్తున్న వారు 1,68,642 మంది. అంటే 18,520 ఖాళీలు ఉన్నాయి. ఇవి కాకుండా ఆదర్శ పాఠశాలలు, గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ పాఠశా లలు కలిపితే ఈ ఖాళీలు 28 వేలకు పైనే ఉన్నాయి. మండల, జిల్లా పరిషత్తు, పురపాలక పాఠశాలల్లోనే 8,366 పోస్టులు అవసరం కానున్నట్లు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి బొత్స ప్రకటించారు.