ETV Bharat / state

ఆటోలపై బోల్తా పడ్డ ఇనుప స్తంభాల లారీ, ఐదుగురు దుర్మరణం - ‌‌‌WARANGAL ROAD ACCIDENT

ఇనుప స్తంభాల లోడ్ తో వెళ్తున్న లారీ తాడు తెగిపోవడంతో జరిగిన ప్రమాదం - పక్కన వెళ్తున్న రెండు ఆటోలు, కారుపై పడిన ఇనుప స్తంభాలు

Five People Died in Road Accident at Warangal District in Telangana
Five People Died in Road Accident at Warangal District in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2025, 4:33 PM IST

Five People Died in Road Accident at Warangal District in Telangana : తెలంగాణ రాష్ట్రం వరంగల్​ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామునూరు వద్ద ఇనుప స్తంభాల లోడ్ తో వెళ్తున్న లారీ తాడు తెగిపోవడంతో పక్కన వెళ్తున్న రెండు ఆటోలు, ఒక కారుపై భారీ స్తంభాలు పడిపోయాయి. ఆ భారీ ఇనుప రాడ్లు ఆటోపై పడిపోవడంతో అందులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరందరు వలస కూలీలుగా గుర్తించారు. మృతులు బిహార్‌కు చెందిన వాసులుగా పోలీసులు వెల్లడించారు. మృతుల్లో మహిళతో పాటు చిన్నారి ఉన్నట్లు తెలిపారు. గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కరీమాబాద్‌కు చెందిన సాగర్‌ అనే ఆటో డ్రైవర్‌కు రెండు కాళ్లు విరగ్గా, పూజ అనే మహిళ స్వల్పంగా గాయపడింది. ముఖేశ్‌ అనే మరో యువకుడు గాయపడ్డాడు. భీతావహ దృశ్యాలతో ప్రమాద ఘటన ప్రాంతం గగుర్పాటుకు గురిచేసేలా కనిపించింది.

చెల్లాచెదురుగా ఇనుప స్తంభాలు : ఈ ప్రమాదం వరంగల్‌-ఖమ్మం రహదారిపై జరగడం, లారీ అడ్డంగా పడిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు మూడు క్రేన్‌ల సహాయంతో సుమారు రెండు గంటల పాటు శ్రమించి రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయిన భారీ ఇనుప స్తంభాలను తొలగించారు. మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అయిన అంబర్‌ కిశోర్‌ ఝా ఎంజీఎం ఆసుపత్రిలో పరామర్శించారు. ఘటన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి నుంచి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.

సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి : వరంగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని వరంగల్‌ జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి : మరోవైపు బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌ రావు సైతం వరంగల్‌ రోడ్డు ప్రమాద ఘటనపై స్పందించారు. మామునూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం ఎంతో దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇనుప స్తంభాల కింద ఇరుక్కున్న వారిని రక్షించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం - ఆటోలపై బోల్తా పడ్డ ఇనుప స్తంభాల లారీ, ఐదుగురు దుర్మరణం (ETV Bharat)

ఆగి ఉన్న బస్సును ఢీకొన్న మినీ వ్యాన్​- 9 మంది స్పాట్ డెడ్

కూరగాయలు అమ్మేందుకు వెళ్తుండగా ప్రమాదం- లోయలో లారీ పడి 11 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.