CM Chandrababu on TTD Ghee Adulteration: తిరుమల లడ్డూకు కల్తీ నెయ్యి వాడి ప్రజల మనోభావాలు దెబ్బతీశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యితో ఇష్టానుసారం క్షమించరాని నేరం చేస్తే వదిలిపెట్టాలా అని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
గత పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బ తీశారని ధ్వజమెత్తారు. లడ్డూ ప్రసాదానికి నాసిరకం నెయ్యి వాడారని మరోసారి స్పష్టం చేశారు. రూ.320కే తక్కువ ధరకు వస్తుందని కల్తీ నెయ్యి వాడారని విమర్శించారు. కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం పెడతారా అంటూ నిలదీశారు. తాను తప్పు చేయలేదు టెండర్ పిలిచానని జగన్ చెబుతున్నారని, రూ.320కే కిలో నెయ్యి వస్తుందంటే ప్రభుత్వం ఆలోచించవద్దా అంటూ ప్రశ్నించారు.
నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది - నాణ్యమైన నెయ్యి అంత తక్కువ ధరకు ఎలా ఇస్తారు? : టీటీడీ ఈవో - TTD EO on Laddu Controversy
Chandrababu Review on TTD Laddu Issue: అంతకు ముందు మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలను, భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. గత ప్రభుత్వ పాలనా సమయంలో తిరుమల లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థ సారధితో పాటు ఉన్నతాధికారులతో తిరుమల అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హాయంలో జరిగిన తప్పిదాలపై సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ముఖ్యమంత్రి ఆదేశించారు.
తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్లతో చర్చించి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.
కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయి- ఎవరినీ వదిలిపెట్టం: నారా లోకేశ్ - Nara Lokesh on TTD Ghee Issue