Young Farmer Bullock Cart Yatra to Amaravati: దళారీ వ్యవస్థతో రైతులు నష్టపోతున్న తీరును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు చెప్పాలని ఓ యువ రైతు నిర్ణయించుకున్నాడు. వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా ఉపాధి పొందుతున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తానే ముందుండి పవన్‌కు వివరించాలని సిద్ధమయ్యాడు. పాడి ఆవుల పాలు కొనుగోలు చేసే దళారీలతో నష్టాలపాలై, అప్పులు మిగుల్చుకున్న అనుభవం అతనిది. పాడితో వచ్చిన నష్టాన్ని, చేసిన అప్పులను తీర్చడానికి తన ఎడ్లబండితో ఇసుక అమ్ముకొని కష్టాలకు ఎదురు నిలిచిన ధీరుడు ఆ యువ రైతు. అతనే శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోటకు చెందిన నవీన్ కుమార్.
తన కష్టాలు, అప్పులు తీరాయి కానీ తోటి రైతులు సాగులో నష్టాన్ని ఎదుర్కోలేక బలవంతపు చావులకు పాల్పడుతున్న తీరుతో నవీన్ కుమార్ తీవ్ర ఆవేదన పడ్డాడు. ఒకరు, ఇద్దరు రైతులకైతే ఏదైనా సహాయపడవచ్చు కానీ రాష్ట్రంలో నష్టపోతున్న తోటి రైతులకు ఏదో ఒకటి చేయాలని భావించాడు. రైతుల సమస్యలు ప్రభుత్వానికి తెలపడానికి గతంలో ఎవరూ చేయని ప్రయత్నం చేస్తూ తన సొంత గ్రామం నుంచి ఎడ్లబండిపైనే అమరావతికి వెళ్లి రైతుల కష్టాలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు చెప్పడానికి పయానమయ్యాడు. నవీన్ కుమార్ వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో రైతుల కష్టాలు తెలుసుకుంటూ, గ్రామాల్లో బస చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు - తొలి ఫేజ్‌లో 42స్టేషన్లు!
అదిరిన సీన్ - పవన్‌ను ఆలింగనం చేసుకున్న బొత్స - ముఖం చాటేసిన పెద్దిరెడ్డి