Hydra Commissioner Ranganath on Demolishing Houses: చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్‌టీఎల్) పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించడంతో పాటు, చెరువుల్లోకి కొత్త నిర్మాణాలు రాకుండా అడ్డుకోవడమే తమ బాధ్యత అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువులను పునరుద్ధరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదని అన్నారు. చెరువులో నీటి విస్తీర్ణం, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లు, విలేజ్ మ్యాప్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నానమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హైడ్రా కమిషనర్ మాట్లాడారు.
పెద్దవాళ్లవైనా, పేదలవైనా కూల్చక తప్పదు: అమీన్‌పూర్ చెరువు తూములు మూసివేయడం వల్లే లేఅవుట్లు మునిగాయని రంగనాథ్ తెలిపారు. ఎఫ్‌టీఎల్ లెవల్ పరిగణనలోకి తీసుకొని చెరువులు సర్వే చేయిస్తామని వివరించారు. తప్పుడు అనుమతులు ఇచ్చినవి, అనుమతులు రద్దు చేసిన ఇళ్లను మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ఉన్న ఇళ్లు పెద్దవాళ్లవైనా, పేదలవైనా కూల్చక తప్పదని అన్నారు. కొంతమంది అక్రమదారులపై చర్యలు తీసుకోవడం వల్లే హైడ్రా చేసే పని అందరికీ తెలిసిందని అన్నారు. ప్రజల్లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన వచ్చిందని దీనిపై చర్చ కూడా జరుగుతోందని రంగనాథ్ వివరించారు.
మానవత్వంతో ఆలోచిస్తే బాధపడాలి: అక్రమ నిర్మాణాల విషయంలో మానవత్వంతో ఆలోచిస్తే సమాజమంతా బాధపడాల్సి వస్తుందని కొన్నిసార్లు అయితే మనసు చంపుకొని పని చేయాల్సి వస్తోందని రంగనాథ్ తెలిపారు. ఎఫ్‌టీఎల్ పరిధి నిర్ధారించాక ఏదైనా నిర్మాణం చేపడితే అలర్ట్ వస్తుందని అక్రమ నిర్మాణాల నియంత్రణకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఎన్నో ఆక్రమణలు జరిగాయని ఇకపై అలా జరగకుండా అడ్డుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. హైడ్రా పనితీరు కారణంగా ప్రజల్లో అవగాహన పెరిగిందని చెరువులు ఆక్రమణకు గురి కాకుండా స్థానికులు కూడా నిఘా పెడుతున్నారని హైడ్రా కమీషనర్ రంగనాథ్ తెలిపారు.
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు - తొలి ఫేజ్‌లో 42స్టేషన్లు!
అదిరిన సీన్ - పవన్‌ను ఆలింగనం చేసుకున్న బొత్స - ముఖం చాటేసిన పెద్దిరెడ్డి