CM Chandrababu on Agriculture Industries: ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ధిపై సచివాయలంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా శాఖల అధికారులు గత 10 ఏళ్ల కాలంలో పరిస్థితులను వివరించారు.
గత పభుత్వం విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయని దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందని సీఎం అన్నారు. ప్రతిశాఖలో కొత్త పాలసీలు తీసుకు వస్తున్నామని, వీటిని సమర్థవంతంగా అమలు చేసి ఆర్థిక పురోగతి సాధించాలని సీఎం సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ప్రజలపై అదనపు భారం లేకుండా ప్రభుత్వ ఆదాయం పెంచే విధానాలను అమలు చేయాలని సీఎం అన్నారు. వ్యవసాయం రంగంలో సమగ్ర యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులు తగ్గించవచ్చన్నారు.
మరోసారి పెద్దమనసు చాటుకున్న సీఎం - 24 గంటలు తిరక్కముందే సాయం - CM Cheyootha Help Within 24 Hours
పథకాలు ఇవ్వడం మాత్రమే కాదు: ప్రభుత్వం అంటే పథకాలు ఇవ్వడం మాత్రమే కాదని ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచడం ముఖ్యమని అన్నారు. 2014 తరువాత విభజన కష్టాలు ఉన్నా నాడు తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం 13.7 శాతం గ్రోత్ రేట్ సాధించిందని అయితే తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వ రివర్స్ నిర్ణయాలతో వృద్ధి రేటు 10.59 శాతానికి తగ్గిందని సీఎం అన్నారు. 2019లో తెలంగాణతో పోల్చితే ఏపీ జీఎస్డీపీలో వ్యత్యాసం కేవలం 0.20 శాతం ఉండేదని, ఆ వ్యత్యాసం 2024కు 1.5 శాతానికి పెరిగిందని సీఎం అన్నారు. 2014-15 మధ్య ఏపీ ప్రజల తలసరి ఆదాయం రూ.93,903 ఉండగా నాటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తలసరి ఆదాయం 2019 నాటికి రూ.1,54,031 పెరిగిందని సీఎం అన్నారు.