తెలంగాణ

telangana

ETV Bharat / state

పూరీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి - STUDENT DIED IN SECUNDERABAD

సికింద్రాబాద్​లో పూరీ రోల్ గొంతులో ఇరుక్కుని విద్యార్థి మృతి - అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్​లో ఆరో తరగతి చదువుతున్న విరన్‌ జైన్‌ - ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

Student Dies After Chapati Roll Gets Stuck In Throat
Student Dies After Chapati Roll Gets Stuck In Throat (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2024, 10:46 PM IST

Updated : Nov 26, 2024, 8:15 AM IST

Student Dies After Chapati Roll Gets Stuck In Throat : మీరు చదివింది నిజమే. ఇప్పటివరకు గొంతులో కోడిగుడ్డు ఇరుక్కొని చనిపోయారు.. నాణెం ఇరుక్కుని మృతి చెందారు.. చికెన్​, మటన్​ ముక్క గొంతుకు అడ్డం వచ్చి చనిపోయారు.. బెలూన్​, చూయింగ్​ గమ్​ అడ్డుపడి చనిపోయారనే వార్తలు చదివి ఉంటారు. ఇలాంటి వార్తలు సోషల్​ మీడియాలో సైతం తెగ చక్కర్లు కొడతాయి. కానీ ఇక్కడ జరిగిన ఘటనలో బాలుడు పూరీ ఇరుక్కుని మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని బేగంపేట పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. తండ్రి గౌతమ్‌ జైన్‌ ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బేగంపేట ఇన్​స్పెక్టర్​ రామయ్య తెలిపిన వివరాల ప్రకారం,సికింద్రాబాద్​ ఓల్డ్​ బోయిగూడకు చెందిన విద్యార్థి పరేడ్​ గ్రౌండ్​ సమీపంలోని అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్​ స్కూల్​లో ఆరో తరగతి చదవుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు విరామ సమయంలో భోజనం చేయడానికి లంచ్​ బాక్స్​ తీశాడు. లంచ్​ బాక్స్​లో మూడు పూరీలను వాళ్ల మమ్మీ చుట్టలుగా చుట్టి పెట్టింది. లంచ్​ బాక్స్​ ఓపెన్​ చేసి పూరీలను నోట్లో పెట్టుకుని తినేందుకు ప్రయత్నించాడు. దీంతో పూరీల చుట్ట గొంతులో ఇరుక్కుంది.. దీంతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అవుతూ కిందపడిపోయాడు చిన్నారి.

వెంటనే బాలుడు అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో పాఠశాల సిబ్బంది చిన్నారిని హుటాహుటిన మారేడుపల్లిలోని గీతా నర్సింగ్​హోంకు తీసుకెళ్లింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్​లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం గొంతులో ఇరుక్కొని ఉన్న పూరీలను తొలగించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఆహారం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి :ఆహారం తినేటప్పుడు నింపాదిగా నమిలి తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఉరుకుల పరుకుల జీవితంలో సమయం లేదని అంతా ఆదరాబాదరగా తినేస్తున్నారు. ఇదే తరువాత వారికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. చాలా పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనానికి సరైన సమయం ఉండటం లేదు. ఉన్న కొద్దిపాటి సమయంలో పిల్లలు తొందర తొందరగా తీనేస్తున్నారని, అందువల్ల వారికి డైజేషన్ సమస్యలు వస్తున్నాయని పిల్లల వైద్యలు చెబుతున్నారు.

ఒకరి నిర్లక్ష్యం ఆ తల్లిదండ్రులకు పుత్రశోకం - స్కూల్​ గేటు పడి ఒకటో తరగతి విద్యార్థి మృతి

చిన్న పిల్లల చేతికి ఏది పడితే అది ఇస్తున్నారా? - గొంతులో ఇరుక్కుపోతాయ్ జాగ్రత్త! - Food Stuck in Throat

Last Updated : Nov 26, 2024, 8:15 AM IST

ABOUT THE AUTHOR

...view details