Civil Society Leaders Released a Book on AP Water Rights :రాష్ట్ర నీటి హక్కులు కాపాడుకోకపోతే ఏపీ విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతు, ప్రజా సంఘాల నాయుకులు అభిప్రాయపడ్డారు. విజయవాడలోని దాసరి భవన్‌లో రైతు నాయకుడు కొల్లి నాగేశ్వరరావు నాలుగో వర్ధంతి నిర్వహించారు. "కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ - కొత్త ప్రభుత్వం ముందు ఉన్న సవాళ్లు" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత టి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, నీటి సమస్యను 5 కోట్ల ప్రజల సమస్యగా చూడాలన్నారు. కృష్ణా నదీ జలాల వివాదంపై బచావత్ ట్రిబ్యునల్ నివేదిక అమలు విషయంలో జాప్యం జరుగుతుందన్నారు. విభజన తరువాత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును రెండు రాష్ట్రాలు పాటించాలని చట్టంలో ఉందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా, వెలిగొండ ప్రాజెక్టులు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్నాయని గుర్తుచేశారు. వీటిని త్వరగా గతిన పూర్తి చేసి నీటి కేటాయింపులు చేయాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం బాధ్యత అప్పగించిందని తెలిపారు. వచ్చేది ఏ ప్రభుత్వం అయినా సరే నీటి హక్కులపై పోరాటం చేయాలని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
గోదావరి పరివాహకమైనా కరవు సీమే- అధ్వానంగా ఉద్యాన రైతుల పరిస్థితి - Irrigation Problems to Farmers
తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలు వాదనలు చేస్తోంది :నీటి హక్కులను కాపాడుకోకపోతే రాష్ట్రం విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వర రావు తెలిపారు. నీటి కేటాయింపులపై తెలంగాణ సర్కార్ అడ్డగోలు వాదన చేస్తోందని విమర్శించారు.పాలమూరు రంగారెడ్డికి అనుమతి లేకపోయిన తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేస్తోందని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం నీటి కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వం వితండవాదం చేస్తుందన్నారు. ఉద్యోగం కోసం మన రాష్ట్రానికి వచ్చిన సర్ ఆర్థర్ కాటన్ ఇక్కడి ప్రజలు ఇబ్బందులు చూసి సాగు నీటి ప్రాజెక్టులు చేపట్టారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సాగు నీటి రంగానికి ప్రాధాన్యత తగ్గిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, రైతు సంఘాలతో సంబంధం లేకుండా కేంద్రంలో చట్టాలు చేసేస్తున్నారని వడ్డేశోభనాదీశ్వరరావు విమర్శించారు.