Johnny Master Released From Chanchalguda Jail: హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శుక్రవారం విడుదలయ్యారు. అక్కడి నుంచి ఆయన కుటుంబ సభ్యులతో కారులో ఇంటికి వెళ్లారు. కాగా లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలు పని చేసే దగ్గరకు వెళ్లి ఇబ్బందులు కలిగించవద్దని, జానీ మాస్టర్, ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ బాధితురాలి వ్యక్తిగత జీవితంలో కల్పించుకోవద్దని హైకోర్టు షరతులు విధించింది.
అసలేం జరిగింది :గత సెప్టెంబరు 16న మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో జానీ మాస్టర్‌పై కేసు నమోదయింది. మైనర్‌గా ఉన్నప్పుడు జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడంటూ మహిళా కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తరువాత బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలో ఇరువురి వాదనల అనంతరం నిన్న హైకోర్టు, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.