శరవేగంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు - 4 నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి Cherlapally Railway Terminal Works : వందేళ్లుగా హైదరాబాద్ నగర ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చుతున్న సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లు ప్రయాణికుల రద్దీని తట్టుకోలేకపోతున్నాయి. ఈ మూడు స్టేషన్ల నుంచి రోజూ దాదాపు 250కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు రైల్వే శాఖ చర్లపల్లి టెర్మినల్‌ను 2016-17లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. మొదట్లో నిధుల కొరత కారణంగా టెర్మినల్ పనులు నెమ్మదిగా కొనసాగాయి.
పరుగులు పెడుతోన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు..
Special Platforms For MMTS Trains : కానీ ఇటీవలి కాలంలో రైల్వేశాఖ చర్లపల్లి టెర్మినల్‌పై ప్రత్యేక దృష్టిసారించి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సంకల్పించింది.అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమవుతున్న ఈ టెర్మినల్ మరో మూడు నాలుగు నెలల్లో అందుబాటులోకి రాబోతుందని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఇది పూర్తయితే ఎంఎంటీఎస్ రైళ్ల కోసం కొత్త లైన్లు, ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వస్తాయి.
Cherlapally Terminal Works : ఎంఎంటీఎస్ రైళ్ల కోసం చర్లపల్లి టెర్మినల్‌లో ప్రత్యేకంగా ప్లాట్ ఫామ్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఐదు ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి. వీటికి అదనంగా మరో నాలుగు ప్లాట్ ఫామ్స్ రాబోతున్నాయి. మొత్తం 9 ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. నాలుగువేల చదరపు అడుగుల విస్తీర్ణంతో అత్యాధునిక సౌకర్యాలతో చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి రాబోతుంది. పాదాచారుల వంతెనలు, ఐదు ఎస్కలేటర్లు, 9 లిప్టులు సైతం అందుబాటులోకి రాబోతున్నాయి. దాదాపు 350 కోట్లు అంచనా వ్యయంతో పనులు కొనసాగుతున్నాయి. ఈ స్టేషన్ నుంచి దూర ప్రాంతాలకు ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపితే స్థానికంగా ఎంఎంటీఎస్ రైళ్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోయే అవకాశం ఉంది.
Second Line between Maulali - SanatNagar :దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్ల నుంచి చర్లపల్లిలో దిగి ఔటర్ రింగురోడ్డు మీదుగా నగరానికి చేరుకునే వెసులుబాటు ఉంటుంది. రెండో దశ ఎంఎంటీఎస్ రైళ్ల ద్వారా కూడా నగరానికి చేరుకునే అవకాశం ఉంటుంది. చర్లపల్లి మీదుగా ఘట్ కేసర్ వరకు నిర్మిస్తున్న ఎంఎంటీఎస్ రెండో దశ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇది పూర్తయితే ప్రయాణం మరింత సులభతరమవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను బైపాస్ చూస్తూ మౌలాలి-సనత్ నగర్ మధ్య రెండో లైను సిద్దమవుతుందడడంతో నగరంలో ఎక్కడా ఆలస్యం కాకుండా రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ప్రయాణికులు భావిస్తున్నారు.