Cheetah At Shamshabad Airport in Hyderabad: అడవిలో ఉండాల్సిన క్రూరమైన జంతువుల్లో జనావాసంలోకి ఒక్కోసారి అదుపు తప్పి వస్తుంటాయి. ఇలా వచ్చిన ప్రతిసారి స్థానికులు భయాందోళన చెందుతారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ విమానశ్రయంలో చిరుత పులి సంచరిస్తూ కలకలం సృష్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఎయిర్‌పోర్టు ప్రహరీ నుంచి చిరుత దూకినట్లు అధికారులు గుర్తించారు. దాంతో పాటు మరో రెండు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు.
Cheetah Jumped Hyderabad Airport Fencing: విమానశ్రయం ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్‌పోర్టు కంట్రోల్ రూమ్‌లో అలారం మోగింది. అనంతరం భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు జరిగిన విషయాన్ని తెలియజేశారు. అటవీ శాఖ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని చిరుతను బంధించేందుకు ప్రయాత్నాలు చేస్తున్నారు. ట్రాప్ కెమెరా, బోన్లు ఏర్పాటు చేశారు. స్థానికులు చిరుత సంచార విషయాన్ని తెలుసుకుని భయభ్రాంతులు చెందుతున్నారు.