తెలంగాణ

telangana

ETV Bharat / state

పనితీరు బాలేకపోతే మార్చడం పక్కా - అభ్యర్థులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్ - Chandrababu Warns TDP Candidates

Chandrababu Warns TDP MLA Candidates : టీడీపీ తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్థులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీట్లు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఎన్నికల వరకు రోజూవారీ చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. జగన్ తన పాలనను నమ్ముకోలేదని, ఊహించని స్థాయిలో చేసే కుట్రలు కుతంత్రాలకు సిద్దంగా ఉండాలని సూచనప్రాయంగా హెచ్చరించారు.

TDP-Janasena Release First List
Chandrababu Video Conference With First List Candidates

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2024, 4:42 PM IST

Chandrababu Warns TDP MLA Candidates :తెలుగుదేశం తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్థుల పని తీరు బాగోకుంటే మార్చేందుకు ఎంత మాత్రం వెనకాడనని అధినేత చంద్రబాబు హెచ్చరించారు. 94 మంది అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ప్రతీ వారం పనితీరు పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల వరకు ప్రతి వారం రోజులకు ఓ సర్వే చేస్తానని తేడా వస్తే వేటు తప్పదని తేల్చి చెప్పారు.

రెండు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తే 100 శాతం ఓట్ల బదిలీ జరుగుతుందన్నారు. వైసీపీ నేతలు పార్టీలోకి వస్తే ఆహ్వానించాలని తెలిపారు. జగన్ తన పాలనను నమ్ముకోలేదని, దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగ ఓట్లు, డబ్బును నమ్ముకున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఊహించని స్థాయిలో జగన్ కుట్రలు కుతంత్రాలు చేస్తారని అన్నింటికీ సిద్దంగా ఉండాలన్నారు.

వచ్చే 40 రోజులు అత్యంత కీలకమన్న చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు. జనసేన నేతలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజల భవిష్యత్ కోసం తెలుగుదేశం-జనసేన కలిశాయని, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా, గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెప్పారు.

'సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం' - హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు

Chandrababu On TDP MLA Candidates 2024 :గతంలో ఎప్పుడూ ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదని గుర్తుచేశారు. పార్టీ అభ్యర్థులకు సైతం ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలని కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశానని తెలిపారు. ఎవరైనా అసంతృప్తితో ఉంటే స్వయంగా వెళ్లి కలవాలని సూచించారు. తటస్థులను కలిసి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి మద్దతు కోరాలన్నారు. కోటి మందికిపైగా అభిప్రాయాలు తీసుకుని సర్వేలు పరిశీలించి, సుదీర్ఘ కసరత్తు చేసి అభ్యర్థుల ఎంపిక చేశానని వివరించారు.

AP Assembly Elections 2024 : దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలో కూడా ఎప్పుడూ ఇటువంటి ప్రయత్నం జరగలేదని, ఇక ఇప్పుడు ఒక్క సీటూ ఓడిపోవడానికి వీలు లేదని తేల్చిచెప్పారు. ఈ ఎన్నికలు రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్​కు ఎంతో కీలకమన్నారు. ఏ స్థాయిలో కూడా చిన్న తప్పు, పొరపాటు జరగకూడదన్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించామని, ఇప్పుడు 99 చోట్ల ఉమ్మడి అభ్యర్థులనూ ప్రకటించామన్నారు. జగన్ అహంకారంతో చేసిన విధ్వంసం అతని పతనానికి నాంది కాబోతోందని చెప్పారు.

చరిత్రలో చూడని విధ్వంస పాలకుడైన జగన్‌ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ ఎన్నికలకు సిద్ధంగా లేడన్న చంద్రబాబు, 'సిద్ధం' అని సభలు పెడుతూ అభ్యర్థులను మాత్రం ప్రకటించలేకపోయాడని ఎద్దేవా చేశారు. సీట్లు వచ్చేశాయి, ప్రజల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కదా అని ఏ ఒక్కరూ ఎన్నికలను సులభంగా తీసుకోవద్దని హితవుపలికారు. ఎంత సీనియర్ నేత అయినా నియోజకవర్గంలో ఎన్ని సానుకూల అంశాలు ఉన్నా చివరి నిముషం వరకు ప్రజల్లో ఉండి కష్టపడాలని దిశానిర్దేశం చేశారు.

కారు జస్ట్ సర్వీసింగ్​కు వెళ్లింది - త్వరలో జెట్​ స్పీడ్​లో దూసుకొస్తుంది : కేటీఆర్​

చిన్న వయసులోనే లాస్య చనిపోవడం బాధాకరం - ఆమె కుటుంబానికి మేం అండగా ఉంటాం : కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details