Cattle Feed Shortage In Nalgonda District :వేసవిలో పశుగ్రాసం కొరత వల్ల మూగ జీవాలు అలమటిస్తున్నాయి. ఈ ప్రభావం పాడిరైతులపై పడుతోంది. నల్గొండ జిల్లా, మిర్యాలగూడ సాగర్ ఆయకట్టు పరిధిలోని పాడి రైతులకు గడ్డు రోజులు ఎదురవుతున్నాయి. ఆయకట్టు పరిధిలో ఎండు గడ్డి కొరత తీవ్రంగా ఉండడంతో పాడి రైతులకు పశు పోషణ రోజురోజుకు భారంగా మారుతోంది. సాగర్ ఆయకట్టు పరిధిలో గత ఏడాది నీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు(Farmers) వరి సాగును అధికంగా చేపట్టారు. ఈ ఏడాది ఎడమ కాలువ నీటి విడుదల లేని కారణంగా ఆయకట్టులో పరిధిలో బోర్లు, బావుల కింద మాత్రమే రైతులు యాసంగిలో(Yasangi Season నీటి వనరులను ఆధారంగా వరి సాగు చేశారు.
Grass Shortage In Nalgonda District : అంతే కాకుండా రైతులు వరికోత యంత్రం సహాయంతో వరిని కోస్తుండటం వల్ల ఎండు గడ్డి ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రస్తుతం వరి సాగు తగ్గడంతో పశుగ్రాసానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. నియోజకవర్గంలోని పాడి రైతులు వరిగడ్డి కోసం ఇతర జిల్లాలకు వెళ్లి లారీలు, ట్రాక్టర్లలో తెచ్చుకుంటున్నారు. గడ్డి(Grass) కొరత ఎక్కువగా ఉండటంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. పాడి రైతులు వరిగడ్డిని కొనలేక ఎక్కువ శాతం పచ్చిమేత, దాణా మీద ఆధారపడుతున్నారు. వరిగడ్డి ధరలు ఈ సీజన్లో రెట్టింపు అయ్యాయి. గతంలో ఒక ట్రాక్టర్ వరిగడ్డి రూ.6000ల నుంచి రూ.7000ల వరకు ఉండేది కాగా ఈ సీజన్లో రూ.9వేల నుంచి రూ.12వేల వరకు పలుకుతుంది. లారీ వరిగడ్డి సుమారు రూ.20వేల నుంచి రూ.30 వేల వరకు పెరిగింది. దీంతో రైతులకు వరిగడ్డి లభించక పశుపోషణ భారంగా మారింది.
గోవుతల్లి గోసపడుతోంది.. దాతల కోసం ఎదురుచూపులు..